గాసిప్స్ న్యూస్

ఆ ఫ్లాఫ్ డైరెక్టర్ తో మాస్ రాజా మూవీ కాన్సిల్!!

మాస్ మహారాజ్ రవితేజ అసలే బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయం కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు, రాజా ది గ్రేట్ సూపర్ హిట్ తర్వత రవితేజ చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయిన విషయం తెలిసిందే, నేల టికెట్, టచ్ చేసి చూడు, అమర్ అక్బర్ అంటోని మరియు డిస్కో రాజా సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటికి మించి ఒకటి భారీ నిరాశ మిగిలించాయి.

ఇలాంటి టైం లో తన ఆశలన్నీ అప్ కమింగ్ మూవీ క్రాక్ పైనే పెట్టుకున్న రవితేజ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల విషయం లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్న రవితేజ క్రాక్ తర్వాత ముందు అనుకున్న సినిమా ను కాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త సినిమాను కమిట్ అయ్యాడు.

క్రాక్ తర్వాత చేయవలసిన లిస్టు లో తనకి వీర సినిమా తో అట్టర్ ఫ్లాఫ్ అందించిన రమేష్ వర్మ కూడా లిస్టులో ఉన్నాడు, రమేష్ వర్మ టాలీవుడ్ లో చేసిన సినిమాలు అన్నీ దాదాపు గా నిరాశ పరిచినవే ఒక్క రైడ్ సినిమా తప్ప. లాస్ట్ ఇయర్ తెలుగులో…

రాక్షసుడు సినిమా తో మళ్ళీ హిట్ కొట్టినా కానీ తమిళ్ లో ఉన్న సినిమా ను ఒక్క మార్పు చేయకుండా ఉన్నది ఉన్నట్లు అలాగే తీర్చిదిద్దాడు. అందుకోసమే రవితేజ తో సినిమా మళ్ళీ చేసే చాన్స్ దక్కినా కానీ ఎందుకనో కొన్ని కారణాల వలన వీళ్ళ కాంబినేషన్ లో మొదలు అవ్వాల్సిన సినిమా ఇప్పుడు కాన్సిల్ అయ్యిందని సమాచారం.

ఇప్పుడు ఆ సినిమా ప్లేస్ లోనే రవితేజ త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉండే సినిమా చేస్తున్నాడట. కథ సరిగ్గా కుదరకనే ఈ సినిమా కాన్సిల్ అయ్యిందనే టాక్ ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తుంది. ఫ్లాఫ్ డైరెక్టర్ ను పక్కకు పెట్టి ఇప్పుడు హిట్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ఇస్తాడో చూడాలి….

Leave a Comment