గాసిప్స్ న్యూస్

ఆ ఫ్లాఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్…ఏం అవుతుందో మరి!!

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరు తమ ఫ్యూచర్ మూవీస్ తో ఫుల్ బిజీ అవుతున్నారు, ఒకటి తర్వాత ఒక్క సినిమా కమిట్ అవుతూ తమ లైనప్ ని స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్.ఆర్.ఆర్ తర్వాత హీరోలు చేయబోయే సినిమాలు ఏంటి అనేది ఆసక్తిగా మారింది.

కాగా ఎన్టీఆర్ వరుస సినిమాలను కమిట్ అవుతున్నా రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీస్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా సమయం ఉన్నప్పటికీ కథలను వింటున్నా ఏవి ఇంకా ఫైనల్ అవ్వడం లేదు అనేది టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్. కాగా రీసెంట్ గా రామ్ చరణ్ కి…

ఫ్లాఫ్ డైరెక్టర్ గా రీసెంట్ గా ముద్ర వేసుకున్న విక్రం కుమార్ ఓ కథ చెప్పాడట. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన విక్రం కుమార్ రీసెంట్ టైం లో హలో తో ఫ్లాఫ్ అందుకోగా రీసెంట్ గా నాని తో గ్యాంగ్ లీడర్ తీసినా అది అనుకున్న రేంజ్ లో అయితే సక్సెస్ కాలేదు.

కానీ విక్రం కుమార్ ఓ కథ ని రామ్ చరణ్ కి వినిపించగా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పిన రామ్ చరణ్ కొన్ని మార్పులు చేర్పులు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఫామ్ లో లేకున్నా కానీ విక్రం కుమార్ ఇది వరకు చేసిన సినిమాలను దృష్టి లో పెట్టుకుని…

తన కెపాసిటీ తెలుసు కాబట్టి పక్కా కథ సెట్ అయితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత సినిమా స్టార్ట్ చేద్దామని రామ్ చరణ్ భావిస్తున్నాడట. మరి విక్రం కుమార్ రీసెంట్ గా నిరాశ పరిచిన సినిమాలను మరిపించి రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కి తగ్గ కథ సిద్ధం చేసి మెప్పిస్తాడో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Leave a Comment