గాసిప్స్ న్యూస్

ఆ సినిమా డేట్ కి వచ్చి ఉంటేనా…అని ఇప్పుడు ఫీల్ అవుతున్న లవ్ స్టొరీ టీం…!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ ఎప్పుడో లాస్ట్ ఇయర్ రావాల్సిన సినిమా, కానీ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వలన పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరిస్థితులు మొత్తం మారిపోయి ఇప్పుడు సినిమా మళ్ళీ…

పోస్ట్ పోన్ అవ్వాల్సిన సమయం వచ్చింది, కాగా టీం పోస్ట్ పోన్ అవుతుందని అఫీషియల్ గా చెప్పినప్పటికీ ముందు సినిమా రిలీజ్ డేట్ ను వేరే అనుకున్నారు. ఇప్పుడు ఆ డేట్ కి సినిమాను దింపి ఉంటే ఎంత బాగుండేది అని ఆలోచిస్తున్నారని సమాచారం.

షూటింగ్ ఆల్ మోస్ట్ జనవరి ఎండ్ టైం కే కంప్లీట్ అయింది. ముందు సినిమాను లవ్ స్టొరీ కాబట్టి లవర్స్ డే రోజు అయిన ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు. కానీ సినిమాలో సారంగధరియా సాంగ్ ను రిలీజ్ కి 1 నెల ముందు రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అండ్ సమ్మర్ ను టార్గెట్ చేస్తే సినిమాకి…

లాంగ్ రన్ ఉంటుంది అన్న కారణంగా ఫిబ్రవరి 14 రిలీజ్ డేట్ తమ దగ్గరే ఉన్నా కానీ సడెన్ గా ఉప్పెన కి ఆ డేట్ ఇచ్చేసి ఏప్రిల్ 16 న సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు, సారంగదరియా సాంగ్ ను మార్చ్ లో రిలీజ్ చేసి సినిమాకి కావాల్సినంత హైప్ ను తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా…

టీం పరిస్థితులు సద్దుమనిగే వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఇలా కాకుండా ఫిబ్రవరి లో ఉప్పెన ప్లేస్ లో లవ్ స్టొరీ రిలీజ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా నిజంగానే అద్బుతాలు సృష్టించి ఉండేది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారట. అదే టైం లో సినిమా ఎప్పుడు వచ్చినా అద్బుతాలు సృష్టించడం ఖాయమని పరిస్థితులు సద్దుకున్నాక ఇదే నిజం అవుతుందని టీం ఆశిస్తున్నారట ఇప్పుడు.

Leave a Comment