గాసిప్స్ న్యూస్

ఆ సినిమా తర్వాత నా మార్కెట్ 100 కోట్లు – మంచు విష్ణు!

మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉన్నా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరైన విజయాలు లేక మార్కెట్ కోల్పోయిన హీరోలలో మంచు విష్ణు కూడా ఒకరు, మంచు మనోజ్ అన్న అడపా దడపా హిట్లు కొట్టి తర్వాత రీసెంట్ గా హిట్స్ లేక డౌన్ అయ్యాడు కానీ మంచు విష్ణు మార్కెట్ కోల్పోయి చాలా టైం అవుతుంది, కెరీర్ మొదలు పెట్టిన తర్వాత కొంత కాలం హిట్స్ కోసం ఎదురు చూసి….

ఢీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత మళ్ళీ హిట్ అన్న మాటకే దూరం అయ్యాడు, ఎంతో ట్రై చేసిన తర్వాత మళ్ళీ చాలా కాలానికి దేనికైనా రెడీ తో మళ్ళీ హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత మళ్ళీ దూసుకెల్తా సినిమా తో కొంత వరకు మెప్పించగా…

తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ లేక పూర్తీగా మార్కెట్ కోల్పోయిన స్టేజ్ లో రీసెంట్ గా మోసగాళ్ళు అంటూ పాన్ ఇండియా లెవల్ తో పాటు హాలీవుడ్ లెవల్ లో 80 కోట్లతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే, ఈ సినిమా తర్వాత మరో భారీ మూవీ….

చేయనున్నాడు మంచు విష్ణు… భారీ బడ్జెట్ తో భక్తకన్నప్ప సినిమా ను చేయబోతుండగా ఆ సినిమా అన్ని భాషల్లో రూపొందుతుందని అంటున్నాడు. కాగా ఇప్పుడంటే తన మార్కెట్ డౌన్ అయింది కానీ ఈ సినిమాల తర్వాత నేను కూడా 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా మారుతానని రీసెంట్ గా మోసగాళ్ళు ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చారట విష్ణు…

ఈ కామెంట్స్ హైలెట్ అవ్వగా రెండు సినిమాలకే 100 కోట్ల మార్కెట్ ఏంటి సామి అంటూ సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఏది ఏమైనా ముందు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక నికార్సయిన హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉండగా అది జరిగిన తర్వాత మార్కెట్ ఎక్స్ పాన్షన్ గురించి ఆలోచిస్తే బెటర్ అని విశ్లేషకులు భావిస్తున్నారు…

Leave a Comment