గాసిప్స్ న్యూస్

ఆ 2 సినిమాల్లో ఒకటి సల్లూ తో…పూరీ మాస్టర్ ప్లాన్!!

సౌత్ డైరెక్టర్స్ లో బాలీవుడ్ లో కూడా మంచి పేరున్న డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ ఒకరు, రామ్ గోపాల్ వర్మ శిష్యుడి గా సుపరిచితమే అయినా కానీ పోకిరి రీమేక్ వాంటెడ్ తో అక్కడ పూరీ పేరు మారు మ్రోగిపోయింది, ఆ సినిమా కి డైరెక్టర్ ప్రభుదేవా నే అయినా హీరో సల్మాన్ ఖాన్ అయినా హీరో క్యారెక్టరైజేషన్ ని డిసైన్ చేసిన పూరీ కి కూడా సాలిడ్ మార్కులు పడగా…

తర్వాత అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ సినిమా చాన్స్ కొట్టేసి హిట్ కొట్టాడు, తర్వాత మళ్ళీ ఎందుకనో పూరీ హిందీ సినిమా వైపు చూడలేదు, రీసెంట్ గా టెంపర్ తర్వాత పెద్దగా ఫామ్ లో లేని పూరీ లాస్ట్ ఇయర్ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ ఫాం లో రాగా…

ఇప్పుడు యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు, కాగా ఈ సినిమా తర్వాత మాత్రం తన అప్ కమింగ్ మూవీ పక్కా బాలీవుడ్ దే అని అంటున్నారు, హీరోగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కన్ఫాం అని అంటున్నారు, రాదే తర్వాత…

సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ఏది కమిట్ అవ్వాలేదు, ఆ సినిమా వచ్చే లోపు పూరీ విజయ్ దేవరకొండ మూవీ కంప్లీట్ చేస్తాడు. కాగా ఈ గ్యాప్ లో పూరీ సల్మాన్ కి 2 ఒరిజినల్ కథలు 2 రీమేక్ సినిమాలు సజెస్ట్ చేశాడని టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, 2 రీమేక్ కథల్లో ఒకటి.. ఇది వరకే అనుకున్న అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి కాగా…

మరొకటి బిజినెస్ మాన్ అని అంటున్నారు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విత్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తే అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి లేదా ఇంటెన్స్ యాక్షన్ మూవీ అంటే బిజినెస్ మాస్ లో ఒకటి కొన్ని మార్పులు చేర్పులతో రీమేక్ చేయొచ్చని చెప్పాడట. అలాగే 2 ఒరిజినల్ కథలు సల్మాన్ కి సూట్ అయ్యేవి కూడా చెప్పగా త్వరలోనే సల్మాన్ నిర్ణయం తీసుకుంటాడని టాక్ ఉంది, మరి ఒరిజినల్ చేస్తాడా లేదా రీమేక్ చేస్తాడో చూడాలి…

Leave a Comment