న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇంకో 41 అంతే…మాస్ 5 డేస్ కలెక్షన్స్!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా కి అయినా పాజిటివ్ టాక్ అన్నది చాలా ముఖ్యం, సినిమా కి టాక్ బాగుంటే కలెక్షన్స్ ఆటోమాటిక్ గా వస్తాయి కానీ ఎంటర్ టైన్ మెంట్ తోడూ అయితే ఆ సినిమా లాంగ్ రన్ లో మంచి జోరు చూపెట్టే అవకాశం ఎంతైనా ఉంది, టాలీవుడ్ రీసెంట్ టైం మంచి కామెడీ ఎంటర్ టైనర్ లు ఏమి రాకపోవడంతో అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి…

కోలివుడ్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ డాక్టర్ సినిమా మంచి ఆప్షన్ గా మారగా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో లిమిటెడ్ రిలీజ్ నే సొంతం చేసుకున్నా షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ… వర్కింగ్ డేస్ లో కూడా జోరు చూపెడుతున్న ఈ సినిమా ఇప్పుడు…

5 వ రోజు కూడా చాలా తక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం… 4 వ రోజు సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే 5 వ రోజు కేవలం 4 లక్షలు మాత్ర్రమే డ్రాప్ అయిన సినిమా 16 లక్షల రేంజ్ లో షేర్ ని….

సొంతం చేసుకుని సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో సినిమా 5 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్క ఇలా ఉంది…
👉Nizam: 31L
👉Ceeded: 15L
👉UA: 17L
👉East: 12L
👉West: 10L
👉Guntur: 12L
👉Krishna: 13L
👉Nellore: 9L
AP-TG Total:- 1.19CR(2.10CR~ Gross)
ఇదీ సినిమా 5 రోజుల టోటల్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ లెక్క…

సినిమాను 1.35 కోట్లకు అమ్మగా 1.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా జస్ట్ 41 లక్షల దూరంలో ఉంది, దసరా సెలవుల్లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక తమిళ్ కలెక్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా సినిమా 5 రోజుల్లో 38 కోట్ల నుండి 40 కోట్ల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. టోటల్ డీటెయిల్స్ ఫస్ట్ వీక్ తర్వాత వస్తాయి.

Leave a Comment