న్యూస్ బాక్స్ ఆఫీస్ స్పెషల్

ఇండస్ట్రీ షాకింగ్ రికార్డ్…(342+–563)…సామి శిఖరం!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ టైం లో సూపర్ ఫామ్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే, బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ డిసాస్టర్ రిజల్ట్ తర్వాత సూపర్ స్టార్ రాంపేజ్ మొదలు అయింది, భరత్ అనే నేను, మహర్షి మరియు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నాడు. లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర…

సంక్రాంతి సెలవులు తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతుంది. కాగా మహేష్ లాస్ట్ 3 సినిమాల కలెక్షన్స్ టాలీవుడ్ హిస్టరీ లోనే ప్రభాస్ ని ఇప్పుడు పక్కకు పెడితే మిగిలిన హీరోల సినిమాల కన్నా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకుని రికార్డుల కెక్కాయి.

భరత్ అనే నేను కలెక్షన్స్ రిలీజ్ కాలేదు కాబట్టి ఎవరి లెక్కల్లో వాళ్ళు కలెక్షన్స్ వేసుకున్నారు. కాగా సినిమా మా అంచనా ప్రకారం 101 కోట్ల షేర్ ని 170 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది. ఇక మహర్షి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 104 కోట్లకు పైగా షేర్ ని… 177 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసింది.

ఇక ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు లేటెస్ట్ కలెక్షన్స్ తో కలిపి 136 కోట్లకు పైగా షేర్ ని 218 కోట్లకు పైగా గ్రాస్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుని సంచలనం సృష్టించింది. మొత్తం మీద లాస్ట్ 3 సినిమాల షేర్స్ కలిపితే ఏకంగా 342 కోట్ల రేంజ్ లో షేర్ ని మహేష్ సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించాడు.

ఇక గ్రాస్ లెక్క మూడు సినిమాలు కలిపి ఏకంగా 563 కోట్ల రేంజ్ కి వెళ్ళింది. ఇది టాలీవుడ్ లో ప్రజెంట్ ప్రభాస్ ని పక్కకు పెడితే మిగిలిన హీరోల్లో ఎవ్వరూ సాధించని రేర్ రికార్డ్. మార్కెట్ ఎక్స్ పాన్సన్ ని ఓ రేంజ్ లో వాడుకున్న మహేష్ బాబు రానున్న సినిమాలతో టాక్ కి అతీతంగా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

Leave a Comment