న్యూస్ రివ్యూ

ఇండియన్ హిస్తరీలో ఇలాంటి కథ రాలేదు…మైండ్ బ్లాంక్ అయ్యే సినిమా!

ఇండియాలో అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు ఎప్పటి కప్పుడు కొత్తదనంతో కూడుకుని ఆడియన్స్ ను అలరించడానికి వస్తూ ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి, చాలా వరకు నిరాశనే మిగిలిస్తాయి. కానీ కొన్ని సినిమాలు అద్బుతమైన ప్రయోగాలుగా పేరు తెచ్చుకుంటాయి. ఈ కోవ లోకే వస్తుంది అస్సామీ భాషలో రెండేళ్ళ క్రితం తెరకెక్కిన ఆమీస్ అనే సినిమా… ఇప్పుడు ఈ సినిమాను సోనీ లివ్ లో హిందీ డబ్ తో రిలీజ్ చేశారు…

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు ఈ సినిమా రాలేదు, అంతలా ఈ సినిమాలో ఉన్న మైండ్ బ్లాంక్ ఎలిమెంట్ ఏంటంటే…. ముందుగా కథ పాయింట్ కి వస్తే… డిఫెరెంట్ ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేస్తూ వాటి మీద PHD చేస్తున్న హీరో అనుకోకుండా…

ఓ చిన్న పాప తల్లి అయిన డాక్టర్ అయిన హీరోయిన్ ని కలుస్తాడు. ఆమె ఫూడీ, మాంసం ఇష్టంగా తింటుంది. ఆమెకి ఆకర్షితుడైన హీరో తనకి మాంసం ఇష్టం కాబట్టి తన కోసం డిఫెరెంట్ డిఫెరెంట్ టైప్ ఆఫ్ మీట్ ఫుడ్ ని ప్రిపేర్ చేసి పెడతాడు. తను కూడా వాటిని ఎంజాయ్ చేస్తూ తింటుంది…

ఇలా వీళ్ళ స్టొరీ సాగుతున్న టైం లో ఆ ఫుడ్ కూడా రొటీన్ అయిన టైం లో ఇంకా డిఫెరెంట్ మీట్ ఏమి లేక తన బాడీ నుండి కొంచం మాంసం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి హీరోయిన్ కి కొత్త రకం మీట్ అంటూ ఇస్తాడు హీరో… తను అద్బుతంగా ఉందని తింటుంది… కానీ అది తన బాడీ మాంసం అని చెప్పడు… కొంత కాలం తర్వాత చెబితే….

ముందు జీర్ణించుకోలేక పోయినా తర్వాత ఆ టేస్ట్ కి అలవాటు పడుతుంది హీరోయిన్… చిన్న చిన్న ముక్కలు కాదు కడుపునిండా తినాలి అని కోరిక కోరుతుంది… ఇక తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ… ఇలాంటి కథని ఎక్కడైనా చూశారా… సినిమా కాన్సెప్ట్ జీర్చించుకోవడానికి కష్టంగా ఉన్నా, తనకన్నా వయసులో పెద్దావిడతో హీరో ప్రేమలో పడ్డా ఒక్కసారి కూడా తనని టచ్ చేయకుండా ప్రేమిస్తాడు.. అలాంటి ప్రేమ చివరికి ఏం అయ్యింది అన్నది సినిమా చూసి తెలుసుకోండి…

Leave a Comment