న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇండియాలో ఆల్ టైం ఎపిక్ రేటు….వరుస ఫ్లాఫ్స్…సల్మాన్ షాక్ ఇచ్చాడు!

థియేటర్స్ రీ ఓపెన్ అయినా కొత్త సినిమాలు ఏవి కూడా రిలీజ్ అవ్వాలి అంటే ముందూ వెనకా ఆలోచిస్తూ ఉండటం తో ఇప్పటికీ OTT యాప్స్ తమ లక్ ని పరీక్షించు కుంటూ ఉన్నాయి, ఇండియా లో రిలీజ్ కి రెడీ గా ఉన్న అనేక సినిమాలను ఎంతో కొంత రేటు ఆఫర్ చేసి తమ యాప్స్ లో రిలీజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉండగా అందులో భాగంగా బాలీవుడ్ సూపర్ స్టార్…

సల్మాన్ ఖాన్ నటించిన అప్ కమింగ్ మూవీ రాధే పై మొదటి నుండి డైరెక్ట్ రిలీజ్ వైపు తీసుకు రావాలని చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి, ఒకటికి మించి ఒక ఆఫర్ ఇస్తూ వస్తున్నా కానీ సల్మాన్ ఖాన్ కానీ యూనిట్ కానీ సినిమా డైరెక్ట్ రిలీజ్ ని అస్సలు ఒప్పుకోవడం లేదు.

దాంతో రీసెంట్ గా మరోసారి హ్యుమంగస్ ఆఫర్ ను సినిమా కి ఇచ్చారట ఒక పెద్ద OTT కంపెనీ వాళ్ళు, ఆ రేటు రెండు సినిమాల బిజినెస్ లతో సమానం అనిపించే విధంగా 250 కోట్ల ఎపిక్ ఆఫర్ ని ఇండియా లో అన్ని భాషల్లో డబ్ చేసి సినిమాను డిజిటల్ రిలీజ్…

చేయడానికి ఇవ్వగా ఆఫర్ చూసి టీం కొంచం టెంప్ట్ అయినా లాభామో నష్టమో అవన్నీ థియేటర్స్ లో రన్ ని బట్టే తేలాలని డైరెక్ట్ రిలీజ్ చేయనే చేయం అని తెగేసి చెప్పేశారట యూనిట్ అలాగే సల్మాన్ ఖాన్. రీసెంట్ గా పెద్దగా ఫాం లో లేని సల్మాన్… భారత్, రేస్ 3, దబంగ్ 3 లాంటి సినిమాలు….

బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో విఫలం అయిన నేపధ్యంలో ప్రభుదేవా డైరెక్షన్ లో చేస్తున్న వాంటెడ్ మూవీ సీక్వెల్ రాధే పైనే ఆశలు పెట్టుకున్నాడు, అందుకే ఎంత ఆఫర్ ఇచ్చినా ఈ సినిమా థియేటర్స్ లోనే రిలీజ్ అని వచ్చే ఇయర్ రంజాన్ కి సినిమా రిలీజ్ అవుతుందని కన్ఫాం చేశారట…

Leave a Comment