గాసిప్స్ న్యూస్

ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా కి రాని OTT ఆఫర్…KGF2 కి వచ్చింది!

ఇండియా మొత్తం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా KGF చాప్టర్ 2. యష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో వచ్చిన మొదటి పార్ట్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకోవడం తో రెండో పార్ట్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోగా ఈ ఇయర్ మొదట్లో వచ్చిన టీసర్ ఇండియన్ రికార్డులతో పాటు ఏకంగా వరల్డ్ రికార్డులను కూడా సొంతం చేసుకోగా…

సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఆడియన్స్ ముందుకు ఈ పాటికే వచ్చి ఉండాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా పాన్ ఇండియా మూవీ కాబట్టి సినిమా కి అన్ని చోట్ల పరిస్థితులు నార్మల్ గా ఉన్నప్పుడే రిలీజ్ చేయలని…

మేకర్స్ ఫిక్స్ అయ్యారు కానీ ఇండియా లో అన్ని చోట్ల ఇంకా థియేటర్స్ రీ ఓపెన్ అవ్వాల్సి ఉంది, అలాగే ఓవర్సీస్ లో కొన్ని చోట్ల ఆల్ రెడీ థార్డ్ వేవ్ ఎఫెక్ట్ కూడా మొదలు అవుతూ ఉన్న నేపధ్యంలో ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ని థియేటర్స్ లో కాకుండా…

డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించాలని బిగ్ OTT జైంట్స్ ట్రై చేస్తున్నాయని సమాచారం. ఇండియా లో ఇప్పటి వరకు ఏ సినిమా కి కూడా ఇవ్వనంత బిగ్గెస్ట్ ఆఫర్ ను ఈ సినిమా కి ఇస్తున్నాయట. లేటెస్ట్ గా ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఓవరాల్ గా మేజర్ భాషలు అన్నీ కలిపి డైరెక్ట్ డిజిటల్ రైట్స్ ను 280 కోట్ల రేంజ్ లో…

రేటు చెల్లించి హక్కులను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ టాప్ OTT ప్లేయర్స్ చెబుతున్నారట. సినిమా కి ఓవరాల్ గా బిజినెస్ అన్ని భాషల్లో కలిపి ఈ రేంజ్ లో ఉండే అవకాశం కొంచం తక్కువే అని చెప్పాలి, కానీ మేకర్స్ మాత్రం ప్రస్తుతానికి ఈ ఆఫర్ ను పక్కకు పెట్టి డిసెంబర్ లో సినిమాను థియేటర్స్ లో దింపాలని చూస్తున్నారు. మరి అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Comment