న్యూస్ ప్రీ రిలీజ్ బిజినెస్ బాక్స్ ఆఫీస్

ఇంత తక్కువ థియేటర్స్ కి ఈ రేంజ్ బిజినెస్సా….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

మారుతి డైరెక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా మెహ్రీన్ హీరోయిన్ గా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ మంచి రోజులొచ్చాయి. వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకున్న మారుతి నుండి తక్కువ టైం లో కంప్లీట్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు దీపావళి రేసులో నిలిచిన ఏకైక తెలుగు సినిమా కాగా రేసులో ఇతర సినిమాల కన్నా కూడా ఈ సినిమా కి ఓవరాల్ గా థియేటర్స్ చాలా…

తక్కువగానే సొంతం అయ్యాయి, కానీ అదే టైం లో సినిమా ఓవరాల్ బిజినెస్ మాత్రం థియేటర్స్ కౌంట్ కన్నా కూడా డబుల్ అనిపించే రేంజ్ లో ఉండటం విశేషం, సినిమా మొత్తం మీద నైజాం ఏరియాలో 90 థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సీడెడ్ ఏరియాలో 40 థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఇక టోటల్ ఆంధ్ర రీజన్ లో సినిమా 130 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 260 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 450 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది.

ఈ తక్కువ థియేటర్స్ లో సినిమా సాధించిన టోటల్ బిజినెస్ ను గమనిస్తే… నైజాం ఏరియాలో 3.5 కోట్ల బిజినెస్ ను ఆంధ్ర రీజన్ లో 3.7 కోట్ల బిజీస్ ను సీడెడ్ ఏరియాలో 1.8 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా, దాంతో తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 9 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల కలుపుకుని 10 కోట్ల టోటల్…

ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించిన ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 10.5 కోట్ల రేంజ్ కి తగ్గకుండా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ తక్కువ థియేటర్స్ లో ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్షన్స్ పరంగా పోటి లో ఉన్న సినిమాలను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

Leave a Comment