న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇక్కడ దెబ్బ కొట్టినా అక్కడ కుమ్మింది…సుల్తాన్ తమిళ్ బిజినెస్ అండ్ కలెక్షన్స్!

కార్తీ రష్మిక ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సుల్తాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు బాగుంది అన్న టాక్ ఆడియన్స్ నుండి లభించింది కానీ తెలుగు లో ఎందుకో ఈ సినిమా రిలీజ్ టైం కి రెండు మూడు వారల ముందు నుండి అన్ని సినిమాలకు కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాకపోవడం లాంటివి ఎఫెక్ట్ గా మారగా… ఆ ఇంపాక్ట్…

ఈ సినిమా పై కూడా పడగా సినిమా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా వీకెండ్ తర్వాత స్లో డౌన్ అయింది. ఇక తర్వాత మొదటి వారం తిరగక ముందే వకీల్ సాబ్ రంగం లోకి దిగడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత స్లో అవ్వగా…

తమిళ్ లో మాత్రం సినిమా బాగానే కుమ్మింది అని చెప్పాలి, అక్కడ మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో వారం ధనుష్ కర్ణన్ నుండి పోటి ని ఎదురుకున్నా కానీ డీసెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

మొత్తం మీద సినిమాను తమిళనాడు లో 17 కోట్లకు అమ్మగా సినిమా మొదటి వారం లో అక్కడ 22 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా, రెండు వారాలు పూర్తీ అయిన తర్వాత మొత్తం మీద 31 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుందట. తమిళ్ లో సినిమా బ్రేక్ ఈవెన్ కి మినిమమ్ 34 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను సినిమా…

సొంతం చేసుకోవాల్సి ఉండగా ఇప్పటికి 31 కోట్లు సాధించిన సినిమా మరో 3 -4 కోట్లు సాధిస్తే అక్కడ క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక తెలుగు లో మాత్రం సినిమా నష్టాలు సాలిడ్ గానే సొంతం చేసుకుందని చెప్పొచ్చు. పోటి తీవ్రంగా ఉండటం సినిమా కి బాగా ఎదురుదెబ్బ కొట్టింది ఇక్కడ…

Leave a Comment