గాసిప్స్ న్యూస్

ఇక్కడ ‘0’ షేర్ సినిమా…కానీ డబ్బింగ్ రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్!!

కింగ్ నాగార్జున కెరీర్ లో అల్టిమేట్ బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి అట్టర్ ఫ్లాఫ్ సినిమాలు కూడా ఉన్నాయి, కానీ అట్టర్ ఫ్లాఫ్ అయిన సినిమాలలో కొన్ని అయినా నాగార్జున ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఉంటాయి కానీ అటు ఫ్యాన్స్ నుండి సామాన్య ప్రేక్షకుని వరకు కూడా అసలు ఎవ్వరినీ ఆకట్టుకోకుండా చిరాకు తెప్పించిన నాగార్జున సినిమా ఏదైనా ఉందీ అంటే అది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన….

ఆఫీసర్ సినిమా అనే చెప్పాలి. ఒక దశలో తన కెరీర్ లోనే శివ లాంటి అల్టిమేట్ పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చాడు కాబట్టి తను ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో ఆదుకోవాలి అని రిస్క్ తీసుకుని మరీ నాగార్జున రామ్ గోపాల్ వర్మ కి ఆఫీసర్ సినిమా ఛాన్స్ ఇచ్చాడు. కానీ రామ్ గోపాల్ వర్మ…

వరస్ట్ అవుట్ పుట్ ఇచ్చి తన ఫాం ని కంటిన్యు చేశాడు ఈ సినిమా తో కూడా… నాగార్జున సినిమా అవ్వడం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసిన సినిమా ఆడియన్స్ నుండి మొదటి ఆటకే ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ తెచ్చుకోవడం తో వీకెండ్ తర్వాత నెగటివ్ షేర్స్ రావడం మొత్తం మీద…

సినిమా జీరో షేర్ మూవీ గా ట్రేడ్ లో చెప్పుకోవడం జరిగింది, అలాంటి అపవాదుని మూట గట్టుకున్న ఈ సినిమా ను నాగార్జున కి తమిళ్ లో ఉన్న ఒకప్పటి క్రేజ్ ని వాడుకోవాలి అని ఇప్పుడు అక్కడ డబ్ చేస్తున్నారట. డబ్బింగ్ రైట్స్ కింద 30 లక్షల దాకా రేటు చెల్లించి ఇప్పుడు తమిళ్ లో…

వేటక్కరన్ అనే టైటిల్ తో డబ్ వర్షన్ ని సిద్ధం చేస్తున్నారట. నాగార్జున నటించిన సినిమాల్లో శివ, రక్షకుడు గీతాంజలి, అన్నమయ్య, గగనం, ఊపిరి లాంటి సినిమాలు అక్కడ కూడా దుమ్ము లేపాయి… కానీ ఇప్పుడు RGV ఇచ్చిన ఈ నాసిరకం సినిమా రిజల్ట్ అక్కడ ఎలా ఉంటుందో అన్న డౌట్ అందరి లోనూ ఉందని చెప్పాలి. త్వరలోనే సినిమాను టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తారని సమాచారం…

Leave a Comment