గాసిప్స్ న్యూస్

ఇటు రాహుల్ కి…అటు దేవి కి ఫ్యాన్స్ తో మ్రోత మ్రోగిపోతుంది!

ఇటీ వలె వచ్చిన మన్మథుడు2 కి అలాగే సరిలేరు నీకెవ్వరు సినిమాలకు ఎలాంటి సంభందం లేకున్నా కానీ మన్మథుడు2 డైరెక్టర్ రాహుల్ కి ఇటు సరిలేరు నీకెవ్వరు మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కి సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా నాన్ స్టాప్ గా మ్రోత మ్రోగిపోతుంది. డానికి కారణం ఇద్దరూ తమ తమ సినిమాల విషయం లో పూర్తి న్యాయం చేయలేదు అంటున్నారు ఫ్యాన్స్… ముందుగా దేవి విషయానికి వస్తే…

గత కొంతకాలంగా ఫామ్ లో లేని దేవి ఒకటి రెండు సినిమాలకు తప్పితే రీసెంట్ టైం లో ఎక్కువ సినిమాలకు నిరాశ పరిచే సంగీతాన్ని అందించాడు, మహేష్ మహర్షి విషయం లో కూడా పాటలు అనుకున్న రేంజ్ లో లేవని ఫ్యాన్స్ అప్పట్లోనే దేవి పై ఫైర్ అయ్యారు.

అందుకే దేవి సరిలేరు నీకెవ్వరు ఓపెనింగ్ టైం లో అదిరిపోయే పాటలు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తానని చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషించగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ చూసి దేవి మళ్ళీ దేబ్బెశాడు అంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. చేస్తున్నారు కూడా…

ఇక రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన మన్మథుడు2 కి సోషల్ మీడియా లో ఎక్స్ ట్రీం నెగటివ్ టాక్ ఉంది, ఒరిజికల్ కల్ట్ క్లాసిక్ అయితే ఇది నాసిరకం సినిమా అంటూ ఓ రేంజ్ లో రెగ్యులర్ ఆడియన్స్ కి తోడూ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోతున్నారు డైరెక్టర్ పై హీరో నాగార్జున పై…

ఫ్యామిలీ సినిమా అని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆడవాళ్ళ మధ్య లిప్ లాక్స్, ఇలా సినిమా మొత్తం అడల్ట్ మూవీ చేసి ఒరిజినల్ ని చెడగొట్టావ్ అంటూ ఫ్యాన్స్ రాహుల్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు గత 2 రోజులుగా సోషల్ మీడియా లో బాగా ట్రోల్ కి గురి అయ్యారు…

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!