న్యూస్

ఇటు 50, అటు 75…ఇది చాలదు అన్నట్లు 150…ఏం రికార్డులు సామి ఇవి!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని రామ్ చరణ్ ఇంట్రో టీసర్ ఇటు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ ల రికార్డుల పర్వం కొనసాగుతూనే ఉంది. లేట్ అయినా లేటెస్ట్ గా రామ్ చరణ్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా రికార్డులు….

తిరగరాసి సత్తా చాటుకోగా, నెల క్రితం రిలీజ్ అయిన ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రిలీజ్ అయినప్పటి నుండి కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ కొత్త బెంచ్ మార్కులను సెట్ చేస్తూ ఉండగా రీసెంట్ గా ఈ టీసర్ అన్ని వర్షన్స్ కలుపుకుని ఒక్క యూట్యూబ్ పరంగానే…

ఏకంగా 50 మిలియన్స్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని సత్తా చాటుకోగా… ఓవరాల్ గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కలుపుకుని డిజిటల్ వ్యూస్ పరంగా ఏకంగా 75 మిలియన్స్ మార్క్ ని కూడా దాటేసి దుమ్ము దుమారం లేపింది. ఇక ఈ టీసర్ రీసెంట్ గా…

కామెంట్స్ పరంగా 1 లక్ష కామెంట్స్ ని అందుకుని టాలీవుడ్ తరుపున మొదటి టీసర్ గా రికార్డ్ సృష్టించగా ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ ని ఏకంగా 1 లక్షా 50 వేల మార్క్ ని దాటించి సరికొత్త రికార్డు ను నమోదు చేసింది. ఇలా అన్ని వైపులా కొత్త రికార్డులను తక్కువ టైం లోనే సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ టీసర్ ఇప్పుడు లైక్స్ పరంగా…

1.2 మిలియన్స్ తో సరికొత్త బెంచ్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది, కొన్ని రోజులలోనే ఈ మార్క్ ని టీసర్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇంట్రో టీసర్లతోనే మైండ్ బ్లోయింగ్ రికార్డులు కొట్టిన ఆర్ ఆర్ ఆర్ మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లకు ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.

Leave a Comment