న్యూస్ స్పెషల్

ఇతర భాషల నుండి తెలుగు లో డబ్ అయిన మూవీస్ లో హైయెస్ట్ TRP సాధించిన సినిమాలు ఇవే!!

తెలుగులో ప్రతీ వారం అనేక సినిమాలు టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ మంచి రేటింగ్ లను సాధిస్తున్నాయి. అందులో అప్పుడప్పుడు కొన్ని డబ్ మూవీస్ సాలిడ్ గా TRP రేటింగ్ లను సొంతం చేసుకుని టాప్ లిస్టు లో నిలిచాయి. కొన్ని సినిమాల TRP రేటింగ్ లు మాత్రం ఇప్పటికీ చాలా వరకు రివీల్ కాలేదు, వాటి లో రజినీకాంత్ నటించిన శివాజీ, కమల్ హాసన్ దశావతారం మరియు సూర్య నటించిన సెవెంత్ సెన్స్ మూవీస్ వి క్లియర్ TRP రేటింగ్ లు రిలీజ్ కాలేదు..

ఇవి కాకుండా వేరే తెలుగు డబ్బింగ్ మూవీస్ లో కొన్ని అప్పుడప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలను కూడా డామినేట్ చేసే రేంజ్ లో ఇక్కడ TRP రేటింగ్ లను సొంతం చేసుకుని షాక్ ఇచ్చాయి. అలాంటి సినిమాల్లో టాప్ 5 తెలుగు డబ్బింగ్ మూవీస్ TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే…

KGF Chapter 1 Telugu TRP Rating

5. KGF చాప్టర్ 1:
2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక సంచలనం….అంచనాలు లేకుండా వచ్చి భీభత్సం సృష్టించింది. అయినా కానీ తెలుగు లో లేట్ టెలికాస్ట్ అయింది… ముందే టెలికాస్ట్ అయ్యి ఉంటే మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేది కానీ లేట్ వల్ల కొంత ఇబ్బంది పడ్డా ఓవరాల్ గా 11.9 TRP రేటింగ్ ని అందుకుని లిస్టులో నిలిచింది.

4. కాంచన 3:
లారెన్స్ కాంచన సిరీస్ లో వచ్చిన కాంచన 3 బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ తో సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకోవడమే కాకుండా టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయిన టైం లో తెలుగు లో 13.1 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఈ లిస్టు లో 4 వ ప్లేస్ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది.

3. కబాలి:
రిలీజ్ కి ముందు ఎంత హైప్ తో రిలీజ్ అయ్యిందో రిలీజ్ తర్వాత అంతే రేంజ్ డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న కబాలి సినిమా అందరికీ షాక్ ఇస్తూ టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు 14.52 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది…

2. బిచ్చగాడు:
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరి ఊహలకు కూడా అందని బ్లాక్ బస్టర్ మూవీ బిచ్చగాడు ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బుల్లి తెరపై కూడా 18.76 TRP రేటింగ్ ని అందుకుని తెలుగు సినిమాలకు కూడా దీటుగా TRP రేటింగ్ ని సాధించి దుమ్ము లేపింది ఈ సినిమా.

1. రోబో:
పదేళ్ళ క్రితం వచ్చిన రోబో బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అల్టిమేట్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బుల్లితెర పై రికార్డ్ బ్రేకింగ్ TRP రేటింగ్ ని అందుకుని తెలుగు డబ్ మూవీస్ లో ఇప్పటికీ టాప్ ప్లేస్ లో 19.04 TRP రేటింగ్ తో నంబర్ 1 గా కొనసాగుతూ దూసుకు పోతూనే ఉంది.

ఈ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం KGF కి ఉన్నప్పటికీ చాలా లేట్ టెలికాస్ట్ వలన మిస్ చేసుకుంది… ఇక రజినీ నటించిన రోబో 2 ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అనుకున్నా 9.8 TRP రేటింగ్ తోనే సరిపెట్టుకుంది. ఇక ఫ్యూచర్ లో ఈ రికార్డ్ కొట్టే చాన్స్ ఎక్కువగా KGF 2 కి ఉందని చెప్పొచ్చు. మరి ఈ సినిమా కాక పొతే ఏ సినిమా ఈ రికార్డ్ ను అందుకుంటుందో చూడాలి.

Leave a Comment