న్యూస్

ఇది కదా పవర్ స్టార్ కి కావాల్సిన ఎమోషన్….సెన్సేషనల్ అప్ డేట్ ఇది!!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో మెంటల్ మాస్ చేయబోతున్నాడు, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస సినిమాలతో దుమ్ము దుమారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలను ఒక్కొటిగా కమిట్ అవుతూ ఫ్యాన్స్ కి అల్టిమేట్ కిక్ ఇస్తూ దూసుకు పొతున్నాడు. ఈ క్రమం లో ఇప్పుడు సరికొత్త సినిమా ను అఫీషియల్ గానే కమిట్ అయ్యి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు.

మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియుం సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలనీ చాలా ట్రై చేశారు కొందరు స్టార్స్ పేర్లు కూడా అనుకున్నారు కానీ ఎవ్వరూ సెట్ కాలేదు, చివరికి ఈ సినిమా అటూ ఇటూ తిరిగి పవర్ స్టార్ దగ్గరకు వచ్చింది.

పవన్ కళ్యాణ్ రానా ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా ను అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు ఫేం డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో తమన్ సంగీతం అందిస్తున్నాడని సినిమాను దసరా కానుకగా అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చారు.

మళ్ళీ మరో రీమేక్ ఏంటి అని అనుకున్నా కానీ సినిమాలో బిజు మోహన్ రోల్ కి ఉండే యాటిట్యూడ్ ని పవన్ కి తగ్గట్లు మార్చి మరింత యాటిట్యూడ్ తో పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఈ స్క్రిప్ట్ ని ఇప్పుడు మారుస్తున్నారట. కాగా వకీల్ సాబ్ తర్వాత క్రిష్ డైరెక్షన్ లో మూవీ అనుకున్నా అది మరింత లేట్ కానుండగా…

ముందుగా ఇప్పుడు ఈ సినిమానే మొదలు అయ్యే అవకాశం ఉందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా తో మినిమమ్ 2 రిలీజ్ లు కన్ఫాం అవ్వగా అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. దాంతో ఫ్యాన్స్ కి వచ్చే ఇయర్ పవన్ నుండి విందు భోజనం పక్కా అని చెప్పాలి.

Leave a Comment