న్యూస్ స్పెషల్

ఇది కదా రికార్డ్ అంటే…సుశాంత్ పేరిట మరో చారిత్రిక రికార్డ్!!

ఎంతో మంది అభిమానులను వదిలి వెళ్ళిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేక పోతున్నారు.. ఆ ఒక్క రోజు కొంచం ధైర్యం చేసి ఉంటె బాగుండేదని కోరుకొని వారు లేరనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఎంత చెప్పినా కానీ పోయిన వ్యక్తీ తిరిగి రాడు కాబట్టి తన గుర్తులే చిరస్థాయిగా నిలిచి పోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటూ తన లాస్ట్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారా ఈ నెల 24 డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఆ ట్రైలర్ లో సుశాంత్ ని చూసి ఎమోషనల్ అవ్వని వాళ్ళు లేరనే చెప్పాలి.

దాంతో పాటే తను నటించిన ఈ చివరి సినిమా చరిత్ర లో నిలిచిపోవాలి అని ప్రతీ ఒక్కరూ లైక్ చేస్తూ ట్రైలర్ కి ఇండియన్ రికార్డులే కాకుండా ఏకంగా కొన్ని గంటల్లోనే వరల్డ్ రికార్డులు కూడా కట్ట బెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక సినిమా ట్రైలర్ రీసెంట్ గా మరో చారిత్రిక రికార్డ్ బెంచ్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. వరల్డ్ సినిమా హిస్టరీ లోనే ఏ ట్రైలర్ కూడా సాధించని విధంగా సంచలన రికార్డ్ ను నమోదు చేస్తూ ఏకంగా 10 మిలియన్స్ లైక్స్ ని సొంతం చేసుకుని చారిత్రిక రికార్డ్ ను నమోదు చేసింది. ప్రతీ ఒక్కరు ఇది సుశాంత్ కి అంకితం అంటూ తమకి తోచిన విధంగా…

ఈ లైక్స్ తో నివాళి అర్పిస్తున్నారు… ఇంకా లైఫ్ టైం లో ఈ ట్రైలర్ మరింత ముందుకు వెళ్లి ఈ బెంచ్ మార్క్ ని ఎవ్వరూ ఇప్పట్లో అందుకోలేని లెవల్ లో నిలిపే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక సినిమా కి కూడా 24 న టెలికాస్ట్ అయ్యాక రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో వ్యూవర్ షిప్ వస్తుందని అంటున్నారు…

Leave a Comment