న్యూస్

ఇది నిజం అయితే…5 భాషల్లో భీభత్సం పక్కా…కాచుకోండి ఇక!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా లెవల్ లో భారీ ఎత్తున రూపొందున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నెలలో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవ్వాల్సింది కానీ కరోనా వలన వచ్చే ఇయర్ సెకెండ్ ఆఫ్ లో రావడానికి సిద్ధం అవుతుంది ఇప్పుడు.

ఇక సినిమాలోని ఇద్దరు హీరోల ఇంట్రోలు రిలీజ్ అవ్వగా అల్టిమేట్ రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమా పై క్రేజ్ మరింత పెరిగి పోగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ లలో సినిమా క్రేజ్ మరో లెవల్ కి చేరే అవకాశం పుష్కలంగా ఉందని లేటెస్ట్ న్యూస్ చూస్తె అర్దం అవుతుంది అని చెప్పాలి.

టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా కి గాను హిందీ లో అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం, ఇద్దరు హీరోల పరచయం అలాగే కీలక సన్నివేశాల గురించి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనుండగా తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అదే విధంగా ఉంటుంది అంటున్నారు.

ఇక ఈ రెండు భాషల లోనే కాకుండా మిగిలిన సౌత్ మూడు భాషలు తమిళ్, కన్నడ మరియు మలయాళంలో కూడా టాప్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని సమాచారం. తమిళ్ లో విజయ్ సేతుపతి, కన్నడ లో శివ రాజ్ కుమార్ ఇక మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ఉంటుంది అని అంటున్నారు.

ఇది కనుక నిజం అయితే ఇప్పటికే అక్కడ మంచి అంచనాలు మోస్తున్న ఈ సినిమా పై క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అది బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అనుకున్నదానికన్నా బెటర్ గా పెర్ఫార్మ్ చేయడానికి ఉపయోగ పడుతుంది అని చెప్పొచ్చు. మరి ఇది నిజం అవుతుందో కాదో త్వరలో తేలనుంది..

Leave a Comment