న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇది మామూలు దెబ్బ కాదు….4 సినిమాలు ఒకెత్తు…ఈ ఒక్క సినిమా ఒకెత్తు!

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం చేసిన ఉప్పెన కలెక్షన్స్ పరంగా మొదటి వారంలో సెన్సేషన్ ని క్రియేట్ చేసినా రెండో వీకెండ్ స్లో డౌన్ అవ్వలేదు, కొత్త సినిమాలు 4 ఒకే సారి రిలీజ్ అయినా కానీ ఉప్పెన ప్రవాహం ఏమాత్రం తగ్గలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కొత్త సినిమాల జోరు మొత్తం ఒకెత్తు ఉప్పెన సినిమా జోరు మరో ఎత్తుగా మారింది అని చెప్పాలి.

ఆ రేంజ్ లో ఉప్పెన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ ని హోల్డ్ చేసింది. సినిమా రెండో వీకెండ్ మూడు రోజుల్లో 5.21 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా కొత్త సినిమాలు 4 కలిపి బాక్స్ ఆఫీస్ దగ్గర 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. అంటే ఉప్పెన ఏ రేంజ్ లో..

రెండు తెలుగు రాష్ట్రాలలో హోల్డ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక మళ్ళీ వర్కింగ్ డేస్ విషయానికి వస్తే 4 కొత్త సినిమాలు కలిపి 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతుండగా ఉప్పెన ఒక్కటే కోటికి పైగా షేర్ ని సొంతం చేసుకుని…

సూపర్ సాలిడ్ గా హోల్డ్ చేసింది అని చెప్పాలి… ఈ రేంజ్ లో హోల్డ్ ని చూస్తుంటే సినిమా జోరు మూడో వారం కూడా కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మూడో వారం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో రెండు కొత్త సినిమాలు రిలీజ్ కాబోతుండగా వాటి ని సినిమా తట్టుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అవలీలగా ఇప్పుడు ప్రతిష్టాత్మక 50 కోట్ల షేర్ మార్క్ ని..

క్రాస్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ కలెక్షన్స్ తోనే సినిమా పాటు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి నెలలో హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న రికార్డ్ ను కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. మరి ఆ రికార్డ్ ఎన్ని రోజులు పడుతుందో చూడాలి ఇక…

Leave a Comment