గాసిప్స్ న్యూస్

ఇది షాకింగ్: చిరు-బాబీ మూవీ…ఆ 2 సినిమాల్లో ఒకటి కన్ఫాం అంటున్నారు!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేసిన ఖైదీ నంబర్ 150 తర్వాత వరుస పెట్టి సినిమాలతో జోరు చూపుతున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వలన సినిమాలు ఆలస్యం అవ్వాల్సి వస్తుంది. సైరా నరసింహా రెడ్డి తర్వాత వరుసగా సినిమాలను కమిట్ అయిన మెగాస్టార్ రెండేళ్ళలో మినిమం 3 సినిమాలతో రావాలి అనుకున్నా కానీ ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో సినిమాలు అన్నీ ఆగిపోయాయి.

కానీ ఇప్పుడు పరిస్థితులు నార్మల్ అవుతున్న నేపధ్యంలో వరుస పెట్టి సినిమాలను కంప్లీట్ చేయాలనీ చూస్తున్న మెగాస్టార్ ఆచార్య ను ఆల్ మోస్ట్ ఫినిష్ చేయగా ఇప్పుడు లూసిఫర్ రీమేక్ ను, తర్వాత వేదాలం రీమేక్ ను చేయబోతుండగా వీటితో పాటు జైలవకుష వెంకీ మామ ఫేం బాబీ డైరెక్షన్ లో…

కొత్త సినిమాను ఆల్ రెడీ అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక వీళ్ళ కాంబినేషన్ లో తెరకేక్కే సినిమా కథ ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది. ఆ కథ ప్రకారం ఒక స్టార్ కి తన ఫ్యాన్ కి మధ్య ఓ గొడవగా సినిమా ఉండబోతుందని రీసెంట్ గా బాబీ కూడా ఆల్ మోస్ట్ చెప్పారు.

దాంతో ఈ సినిమా కథ పాయింట్ ఓ రెండు సినిమాలను గుర్తు చేస్తుంది ఇప్పుడు. ఆ రెండు సినిమాల్లో ఒకటి హిందీ షారుఖ్ ఖాన్ నటించిన ఫాన్ సినిమా కాగా మరోటి మలయాళంలో పృద్వీరాజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా లు… ఈ రెండింటిలో కూడా స్టార్ కి అతని ఫ్యాన్ కి కొన్ని కారణాల వలన గొడవలు జరుగుతాయి… ఇప్పుడు చిరు బాబీ ల సినిమా ఈ రెండు సినిమాల్లో…

ఒకదాని రీమేక్ అవ్వొచ్చు లేదా ఇదే కాన్సెప్ట్ ను ఎంచుకుని సినిమా తీస్తున్నారు అంటూ టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అంటూ బాబీ చెప్పడం తో మెగాస్టార్ ఈ సారి డిఫెరెంట్ అటెంప్ట్ తో దుమ్ము లేపడం ఖాయమని అనిపిస్తుంది. ఈ సినిమా వచ్చే ఇయర్ ఆడియన్స్ ముందుకు వస్తుందని అంటున్నారు ఇప్పుడు.

Leave a Comment