గాసిప్స్ న్యూస్

ఇది షాకింగ్: మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాకి సాలిడ్ OTT రేటు!!

టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాల విషయం లో చాలా ఆచితూచి ఎప్పుడో కానీ సినిమాలు చెయ్యట్లేదు…. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నా కానీ ఫుల్ లెంత్ రోల్ చేసి చాలా కాలమే అవుతుంది. ఈ మధ్య తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని ఫిక్స్ అయిన మోహన్ బాబు చేస్తున్న లేటెస్ట్ మూవీ సన్ ఆఫ్ ఇండియా…. రీసెంట్ గా టీసర్ కూడా రిలీజ్ అయిన…

ఈ సినిమా టీసర్ ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పాలి. చాలా కాలంగానే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ మొత్తం ఇప్పుడు కంప్లీట్ అవ్వగా పరిస్థితులు బాగుంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నా కానీ ప్రస్తుతం ఆగిపోయిన సినిమాలు చాలా ఉండటం…

థియేటర్స్ అన్నీ తెరిస్తే… వరుస పెట్టి ఆగిన సినిమాలు ఆ నెలలో షెడ్యూల్ అయిన సినిమాల వలన ఇబ్బందులు ఎక్కువ ఎదురు అయ్యి థియేటర్స్ సమస్య వచ్చేలా ఉండటం తో ఈ సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా సినిమా మేకర్స్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక సినిమా డిజిటల్ రిలీజ్ కోసం రెండు మూడు OTT యాప్స్ సాలిడ్ రేటు నే ఆఫర్ చేశాయని తెలుస్తుంది. ప్రస్తుతం మోహన్ బాబు కి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా మార్కెట్ లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కానీ ఈ సినిమా కి డిజిటల్ రిలీజ్ కోసం 4.5 కోట్ల దాకా రేటు ఆఫర్ చేశారని టాలీవుడ్ ట్రేడ్ లో టాక్ ఉంది.

ప్రస్తుత మార్కెట్ రేంజ్ కన్నా కూడా ఇది సాలిడ్ రేటు అనే చెప్పాలి. బిజినెస్ జరిగినా ఇంత జరుగుతుందా అన్న నమ్మకం అయితే లేదని చెప్పొచ్చు. కానీ మేకర్స్ ఇంతకన్నా బెటర్ ఆఫర్ వస్తే ఆలోచిస్తాం లే అని ఎదురు చూస్తున్నారని అంటున్నారు ఇప్పుడు. మరి ఇంతకన్నా బెటర్ ఆఫర్ వస్తుందా లేక ఈ రేటే తగ్గుతుందా అన్నది త్వరలో తేలనుంది.

Leave a Comment