గాసిప్స్ న్యూస్

ఇది షాకే….రిలీజ్ కి ముందు రోజు లీక్ అయిన వైల్డ్ డాగ్!

పైరసీ అనేది ఎప్పటి నుండి అన్ని ఇండస్ట్రీలను పట్టి పీడిస్తున్న మహమ్మారి… ఎంత అరికట్టాలని చూసినా అది ఆగడం కష్టమే, రిలీజ్ అయిన సినిమాల పైరసీ జరగడం మామూలు అయిపోగా, అప్పుడప్పుడు రిలీజ్ కి ముందే సినిమాలోని సీన్స్ లీక్ అవ్వడం లాంటివి జరుగుతూ వస్తూ ఉండగా కొన్ని సార్లు ఏకంగా సినిమానే లీక్ అవ్వడం లాంటివి జరిగాయి. అత్తారింటికి దారేది సినిమా విషయం లో టోటల్ సినిమానే లీక్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

తర్వాత కూడా అడపాదడపా కొన్ని సినిమాల విషయం లో ఇది జరగగా, ఇప్పుడు కొన్ని సినిమాల థియేటర్ అండ్ డిజిటల్ రిలీజ్ కూడా ఉండటం తో అవి ఒకే టైం లో లీక్ అవ్వడం జరిగింది, కానీ రీసెంట్ గా కేవలం థియేటర్స్ లోనే రిలీజ్ కి సిద్ధం అయిన…

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ వైల్డ్ డాగ్ సడెన్ గా రిలీజ్ కి ముందు రోజు ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయ్యి పైరసీ జరిగింది. ఎవరు చేశారో తెలియదు కానీ సినిమా ట్రైలర్ లో ప్రోమో లో చూపెట్టని చాలా సీన్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ లీక్ అయ్యాయి.

దాంతో సినిమా మొత్తం లీక్ అయిందని అందరికీ అర్ధం అవ్వగా వాటిని చూసిన ఫ్యాన్స్ మరియు కామన్ ఆడియన్స్ వెంటనే టీం కి చెప్పడం తో ఎలాగోలా కొన్ని లింకులను అయితే బ్లాక్ చేయించారు టీం. టీం లోనే ఎవరో ఒకరు ఈ పని చేసి ఉంటారని టాక్ వస్తుంది కానీ దానిపై ఇంకా పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

ఇలా రిలీజ్ కి ముందు క్షణం వరకు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో టీం అలెర్ట్ గా ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు ఇలాంటి సందర్బాలు వస్తూ ఉండటం విచారకరం…త్వరలోనే ఈ పని చేసిన వాళ్ళు దొరికి వాళ్ళు దొరుకుతారని అంటున్నారు. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు రావడం తో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Leave a Comment