న్యూస్

ఇదీ మాస్ అంటే…..రికార్డ్ వ్యూస్ తో నారప్ప భీభత్సం!!

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నారప్ప… బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వన్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ మూవీస్ గా నిలిచిన ఈ సినిమా థియేటర్స్ లో ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది అని అందరూ ఆశించినా కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన మారిన పరిస్థితుల ఎదురుదెబ్బ తో సినిమా రిలీజ్ ను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా…

డిజిటల్ లో చేయాల్సి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా కోసం అత్యంత భారీ రేటు పెట్టి కొనగా రీసెంట్ గా సినిమా డైరెక్ట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి అల్టిమేట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇతర భాషల వాళ్ళు కూడా ఒరిజినల్ తో కంపేర్ చేస్తూ…

ఈ సినిమాను చూశారు… దాంతో సినిమా కి మొదటి రోజు వ్యూవర్ షిప్ అదిరిపోయే విధంగా వచ్చిందని చెబుతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన తెలుగు మూవీస్ లోకి హైయెస్ట్ వ్యూవర్ షిప్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు… ఎన్ని వ్యూస్ అనేది అమెజాన్ రిలీజ్ చేయలేదు…

అమెజాన్ ప్రైమ్ వాళ్ళు నెలకోసారి టాప్ వ్యూవర్ షిప్ మూవీస్ ని చెబుతూ ఉంటారు. అప్పుడు క్లారిటీగా లెక్కలు వస్తాయి కానీ టాలీవుడ్ తరుపున రిలీజ్ అయిన పెద్ద సినిమాల్లో అమెజాన్ లో వి ది మూవీ, నిశబ్దం, వకీల్ సాబ్ మూడో వారంలో డిజిటల్ రిలీజ్ అవ్వగా ఆ సినిమాలన్నింటి కన్నా కూడా నారప్ప సినిమా కి ఫస్ట్ డే వ్యూస్…

అనుకున్న రేంజ్ కన్నా ఎక్కువ వచ్చాయి అంటున్నారు. సినిమా మీద క్రేజ్ కి ఇది నిదర్శనం అనొచ్చు… కోలివుడ్ ఫ్యాన్స్ కూడా అసురన్ తో కంపేర్ కోసం ఎగబడి ఈ సినిమాను చూశారు… దాంతో ఓవరాల్ వ్యూవర్ షిప్ దుమ్ము లేపింది. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే మాస్ సీన్స్ కి థియేటర్స్ షేక్ అయ్యేవి కానీ ఇప్పుడు డిజిటల్ లో అదరగొడుతుంది ఈ సినిమా..

Leave a Comment