న్యూస్

ఇదేం క్రేజ్ రా బాబు…రికార్డులు చెల్లాచెదురు చేస్తున్న లవ్ స్టొరీ ట్రైలర్!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి 24 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా మరో పక్క సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ ట్రైలర్ టాలీవుడ్ లో ఇప్పుడు…

మీడియం రేంజ్ మూవీస్ పరంగానే కాదు టాప్ ట్రైలర్ ల రికార్డుల విషయంలో కూడా ఒకటిగా నిలుస్తూ సంచలనం సృష్టిస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 1 గంట లోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ మార్క్ ని అందుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో…

ఫాస్టెస్ట్ 50 వేల లైక్స్ ని ఇది వరకు నాని వి మూవీ 47 నిమిషాల్లో అందుకుంటే ఇప్పుడు లవ్ స్టొరీ 36 నిమిషాల్లో ఆ రికార్డ్ అందుకుంది. ఇక ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ విషయం లో ఇది వరకు నితిన్ చెక్ మూవీ కి 118 నిమిషాల టైం పట్టగా ఆ రికార్డ్ ను ఇప్పుడు లవ్ స్టొరీ ట్రైలర్…

72 నిమిషాల్లో అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది, 1 లక్ష లైక్స్ విషయంలో ఏకంగా టాలీవుడ్ టోటల్ ఫాస్టెస్ట్ ట్రైలర్స్ రికార్డులో 10 వ ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు 2 లక్షల లైక్స్ విషయం లో కూడా సంచలనం సృష్టించింది. టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 2 లక్షల లైక్స్ మార్క్ ని అందుకున్న సినిమాల్లో ఏకంగా…

టాప్ 5 ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించింది… 2 లక్షల లైక్స్ ని అందుకోవడానికి 3 గంటల 36 నిమిషాల టైం ని తీసుకున్న ఈ ట్రైలర్ ఇప్పుడు 24 గంటలు ముగిసే టైం కి టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో కొత్త రికార్డులు అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా టాలీవుడ్ బిగ్ మూవీస్ లో కూడా ఒకటిగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందనిపిస్తుంది..

Leave a Comment