న్యూస్ స్పెషల్

ఇదేమి కసి రా బాబు…చరిత్ర చింపేశారు!!

హీరోల ఫ్యాన్ వార్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే, తెలుగు లో స్టార్ హీరోల ఫ్యాన్స్ రికార్డుల గురించి ఎక్కువగా పోటి పడుతూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి కానీ ఒకరి పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేయరు, కానీ తమిళ్ ఫ్యాన్ వార్స్ అలా ఉండవు, అక్కడ ముఖ్యంగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎప్పుడు నువ్వా నేనా అంటూ నెగటివ్ కామెంట్స్ తో కూడుకున్న ట్రెండ్స్ ఎన్నో ఇప్పటికే చేశారు కూడా…

ఆ ఫ్యాన్స్ మరెవరో కాదు కోలివుడ్ లో రజినీ తర్వాత టాప్ ప్లేస్ కోసం నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న విజయ్ మరియు అజిత్ ఫ్యాన్స్. ప్రస్తుతం విజయ్ వరుస హిట్ల తో జోరు మీదున్నాడు కాబట్టి లీగ్ లో కొన్ని మెట్లు ముందు ఉన్నాడని చెప్పొచ్చు. అజిత్ కూడా ఈ ఇయర్ విశ్వాసం తో తమిళనాడు లో రికార్డులు తిరగరాశాడు.

ఇక ఈ ఇయర్ కి గాను ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ అయిన హాష్ టాగ్స్ అంటూ ట్విట్టర్ అఫీషియల్ గా ఓ 5 హాష్ టాగ్స్ ని ఫస్టాఫ్ కి గాను సేకరించిన సమీకరణాలతో రిలీజ్ చేయగా విశ్వాసం హాష్ టాగ్ టాప్ లో ఉండగా విజయ్ బిగిల్ ఎక్కడ అంటూ విజయ్ ఫ్యాన్స్ వరుస కామెంట్స్ తో రెచ్చిపోగా…

ఇయర్ ఎండ్ కి మళ్ళీ అప్ డేట్ చేస్తామని చెప్పిన ట్విట్టర్ వారు అఫీషియల్ గా ఏ తమిళ్ మూవీ ఇయర్ ఎండ్ కి టాప్ లో ఉంటుంది అనుకుంటున్నారో అని పోల్ పెట్టారు, అందులో విశ్వాసం, బిగిల్ కి తోడూ NGK కూడా ఉండగా ఇక విజయ్ అజిత్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. విజయ్ ఫ్యాన్స్ చాలా సేపు డామినేట్ చేయగా…

తర్వాత అజిత్ ఫ్యాన్స్ రెచ్చిపోయి 24 గంటలు ముగిసే సరికి బిగిల్ ని దాటి సూపర్ లీడ్ తో రికార్డ్ కొట్టారు. ఇండియా లో అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఇది బిగ్గెస్ట్ పోల్ అని అంటున్నారు. ఏకంగా 2 లక్షలా 55 వేలకి పైగా ట్వీట్స్ పోల్ అయ్యి సంచలనం సృష్టించగా ఈ తమిళ్ ఫ్యాన్స్ కసి చూసి ఇతర ఇండస్ట్రీ ల ఫ్యాన్స్ ఇదేమి కసిరా బాబు అనుకుంటున్నారు.

Leave a Comment