న్యూస్

ఇదేమి బ్యాటింగ్ రా బాబు…15 వ సారి రికార్డ్ TRP రేటింగ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా వినయ విదేయ రామ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంది అన్నది అందరికీ తెలిసిందే, సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ని సొంతం చేసుకోగా సంక్రాంతి హాలిడేస్ అడ్వాంటేజ్ తో ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధించింది…..

కానీ సినిమా అసలు సిసలు పంజా మాత్రం టెలివిజన్ పై వేసింది అని చెప్పాలి… తొలిసారి టెలికాస్ట్ అయినప్పుడు ఫ్లాఫ్ రేటింగ్ నే సొంతం చేసుకున్నా కానీ తర్వాత నుండి ఈ సినిమా హోల్డ్ చేసిన విధానం మరో లెవల్ అనే చెప్పాలి. టెలికాస్ట్ చేసిన ప్రతీసారి కూడా…

అద్బుతమైన రేటింగ్ లను సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం చేసిన ఈ సినిమా వారం 10 రోజుల గ్యాప్ తో స్టార్ మా ఛానెల్ లో కంటిన్యుగా టెలికాస్ట్ అవుతూనే వస్తుంది, ఇక రీసెంట్ గా 15 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా రికార్డ్ లెవల్ లో 5.41 రేటింగ్ ని సాధించి….

మరోసారి సత్తా చాటుకుంది. 14 వ సారి రేటింగ్ కొద్దిగా తగ్గినా కానీ తిరిగి 15 వ సారి స్ట్రాంగ్ హోల్డ్ లో దుమ్ము లేపిన ఈ సినిమా టెలివిజన్ లో మారథాన్ రేటింగ్ లను ఒకసారి గమనిస్తే..
1st time –7.9
2nd time –8.2
3rd time –8.16
4th –7.2
5th –8.18
6th –5.19
7th –6.35
8th -7.97
9th -7.55
10th -7.51
11th -7.68
12th -5.98
13th -5.12
14th – 4.37
15th time- 5.41 TRP****

ఇలా టెలికాస్ట్ అయిన ప్రతీసారి కూడా అద్బుతమైన రేటింగ్ లను టెలివిజన్ లో అందుకోవడం విశేషం అనే చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ టెలివిజన్ లో మాత్రం వినయ విదేయ రామ కల్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గా మారింది అని చెప్పొచ్చు.

Leave a Comment