న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇదేమి రికార్డ్ సామి…4 సినిమాల కలెక్షన్స్ కలిపినా క్రాక్ 15 వ రోజు కలెక్షన్స్ ని అందుకోలేదు!!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పండగ టైం లో థియేటర్స్ ఇబ్బందులను ఎదురుకున్నా తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 15 వ రోజు…

మరో సారి రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా పోటిలో ఉన్న అన్ని సినిమాల కలెక్షన్స్ ని కలిపినా క్రాక్ 15 వ రోజు కలెక్షన్స్ కన్నా తక్కువ ఉండటం ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త సినిమా బంగారు బుల్లోడు రెండో రోజు మొత్తం మీద…

40 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా, సంక్రాంతి హాలిడే కి రిలీజ్ అయిన రామ్ రెడ్ మూవీ 30 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది, ఇక అల్లుడు అదుర్స్ సినిమా 14 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా సంక్రాంతి డబ్బింగ్ మూవీ మాస్టర్ మొత్తం మీద 23 లక్షల షేర్ ని సాధించింది.

ఈ నాలుగు సినిమాల లేటెస్ట్ కలెక్షన్స్ మొత్తం కలిపితే 1.07 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా క్రాక్ సినిమా విషయానికి వస్తే రిలీజ్ అయిన 15 వ రోజు ఈ సినిమా ఏకంగా 1.22 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ఊరమాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. 4 సినిమాల కలెక్షన్స్ ఒకెత్తు క్రాక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 వ రోజు కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి.

ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన క్రాక్ సినిమా వరల్డ్ వైడ్ గా 33 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఇప్పుడు 35 కోట్ల మార్క్ వైపు పరుగులు తీస్తుంది. మిగిలిన సినిమాల్లో బంగారు బుల్లోడు మరియు అల్లుడు అదుర్స్ సినిమాలు బ్రేక్ ఈవెన్ కి చాలా కష్టపడాల్సిన అవసరం ఉండగా రెడ్ మరియు మాస్టర్ లు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి.

Leave a Comment