న్యూస్ రివ్యూ

ఇదే ఫైనల్…అల వైకుంఠ పురంలో ఫైనల్ టాక్ ఇదే!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “అల వైకుంఠ పురంలో” రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్ షోలకు పాజిటివ్ టాక్ ని రెగ్యులర్ షోలకు హిట్ కి తగ్గని టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఈవినింగ్ షోలకు వచ్చే సరికి ఫ్యామిలీ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది.

ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే వారు సినిమాని ఓ రేంజ్ లో ఇష్టపడుతున్నట్లు తెలుస్తుంది, సినిమాలో వచ్చే ఎమోషన్స్, కామెడీ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుందని, భారీ స్టార్ కాస్ట్ వీనులవిందులా అనిపించిందని, కానీ యాక్షన్ డోస్ అంత ఎక్కలేదని అంటున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్ కి యాక్షన్ పెద్దగా కనెక్ట్ కాదు కాబట్టి ఆ పార్ట్ ని పక్కకు పెడితే సినిమా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వారు డిక్లేర్ చేస్తున్నారు. వారి నుండి సినిమా కి సూపర్ హిట్ రేంజ్ కి ఏమాత్రం తగ్గని టాక్ లభిస్తుందని చెప్పొచ్చు. ఇక కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే వారి నుండి వినిపిస్తున్న మేజర్ కంప్లైంట్…

సినిమా కథ చాలా అంటే చాలా సింపుల్ గా ఉండటం, కథలో ఇన్వాల్వ్ అవ్వడానికి సమయం పట్టడం అని అంటున్నారు, అవి తప్పితే సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, సెకెండ్ ఆఫ్ వేరే హీరోల డాన్స్ మూవ్ మెంట్స్, ఫోక్ సాంగ్ లో డాన్స్ యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్ ఇలా మిగిలినవన్నీ నచ్చాయని అంటున్నారు.

ఫైనల్ గా వారి నుండి కూడా హిట్ కి తక్కువ కాని టాక్ వినిపిస్తుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫ్యాన్స్ నుండి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు సూపర్ హిట్ రేంజ్ టాక్, కామన్ ఆడియన్స్ హిట్ రేంజ్ టాక్ చెబుతున్నారు కాబట్టి ఇక సంక్రాంతి హాలిడేస్ నెక్స్ 7 డేస్ బాక్స్ ఆఫీస్ దగ్గర “అల వైకుంఠ పురంలో” దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment