న్యూస్ రివ్యూ

ఇదే ఫైనల్… చిత్రలహరి ఫైనల్ టాక్ ఇదే!!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి మంచి పాజిటివ్ బజ్ నడుమ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, కాగా సినిమా ప్రేక్షకుల మనసు ని ఫుల్ గా గెలిచిందా అంటే ముందుగా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత రెగ్యులర్ షోకి కూడా….

ఇదే విధమైన టాక్ ని సొంతం చేసుకుంది, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి అలాగే కామన్ ఆడియన్స్ నుండి సినిమా కి ఫైనల్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తి గా మారింది, కాగా సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి…

పూర్తిగా కాకున్నా పార్ట్ పార్టులుగా నచ్చింది అని చెబుతున్నారు, ఫిలాసఫీ డైలాగ్స్ కావచ్చు, హీరో సక్సెస్ కోసం కష్టపడే తీరు కానీ బాగా ఆకట్టున్నాయని, అలాగే దేవి శ్రీ ప్రసాద్ పాటలు చాలా కాలం తర్వాత మంచి ఫీల్ గుడ్ పాటలు విన్న ఫీలింగ్ కలిగించాయని అంటున్నారు.

సినిమా లో పోసాని రోల్ ఎక్కువ నచ్చింది అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తీ ఫ్యామిలీ కలిసి చూసేలా సినిమా ఉందని, కథ మరింత పకడ్బందీగా రాసుకుని ఉంటే మరింత బాగుండేది అని వారు చెబుతున్నారు, ఫైనల్ గా వాళ్ళ నుండి సినిమా కి పాజిటివ్ టాక్ లభించింది.

ఇక కామన్ ఆడియన్స్ మాత్రం స్టొరీ యిట్టె చెప్పెదిగా ఉందని, ఫిలాసఫీ డైలాగులు మరీ ఎక్కువే పెట్టారని, అక్కడక్కడ స్లో అయిందని అంటున్నారు, వారు ఫైనల్ గా యావరేజ్ నుండి ఎబో యావరేజ్ గా చెబుతున్నారు. ఫైనల్ గా సినిమాకి ఎక్కువ మంది ఎబో యావరేజ్ టాక్ ని ఫిక్స్ చేశారు. ఈ టాక్ గత 6 సినిమాల కన్నా బెటర్ అవ్వడం తో ఇక బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Comment

Do NOT follow this link or you will be banned from the site!