న్యూస్ రివ్యూ

ఇదే ఫైనల్….“భీష్మ” ఫైనల్ టాక్ ఇదే!!

యూత్ స్టార్ నితిన్ రష్మిక ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా మొదటి ఆటకే ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా రెగ్యులర్ షోల రెస్పాన్స్ కూడా పాజిటివ్ గా ఉంది, ఇక ఈవినింగ్ షోల సమయానికి కామన్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ నుండి సినిమా కి ఫైనల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది.

ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా ను వారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కామెడీ సీన్స్ అయితే మరో లెవల్ లో ఎంజాయ్ చేస్తున్నారు, కొన్ని యాక్షన్ సీన్స్ ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా సినిమా హిట్ కి సూపర్ హిట్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఉందని చెబుతున్నారు.

ఇక యూత్ ఆడియన్స్ కూడా సినిమా లో కోరుకునే లవ్ స్టొరీ తో పాటు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఉండటం యాక్షన్ సీన్స్ కూడా బాగా ఉండటం తో సినిమా మెప్పించిందని చెబుతున్నారు. స్టొరీ రొటీన్ గా ఉండటం క్లైమాక్స్ రొటీన్ గా ఉండటం ఒక్కటే చిన్న మైనస్ అంటున్నారు.

వారి నుండి కూడా సినిమా కి హిట్ కి ఏమాత్రం తగ్గని టాక్ వినిపిస్తుంది, ఇక చివరగా కామన్ ఆడియన్స్ కూడా కథ యిట్టె చెప్పే విధంగా ఉందని, అంత మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా కి రొటీన్ క్లైమాక్స్ కాకుండా మరింత బెటర్ గా ట్రై చేసి ఉంటె…

మరో లెవల్ లో ఉండేదని కానీ రీసెంట్ టైం లో వన్ ఆఫ్ బెస్ట్ ఎంటర్ టైనర్స్ లో ఈ సినిమా ఒకటని చెబుతూ హిట్ నుండి సూపర్ హిట్ టాక్ చెబుతున్నారు. ఫైనల్ గా రోజు ముగిసే సరికి భీష్మ సినిమా కి అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి యునానిమస్ హిట్ రిపోర్ట్స్ దక్కుతున్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి.

Leave a Comment