గాసిప్స్ న్యూస్

ఇదే ఫైనల్…లవ్ స్టొరీ కి మమ్మోత్ రేటు….కానీ బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నారు!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎప్పుడో లాస్ట్ ఇయర్ సమ్మర్ కే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ఫస్ట్ వేవ్ కారణంగా అప్పుడు రిలీజ్ ఆగిపోగా డిజిటల్ రిలీజ్ కి ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు. ఇక ఈ ఇయర్ సమ్మర్ కి గ్రాండ్ గా రిలీజ్ చేయాలి అనుకున్నా కానీ…

సెకెండ్ వేవ్ దెబ్బ కొట్టడం తో అన్ని సినిమాల కన్నా ముందు పోస్ట్ పోన్ అయిన సినిమాగా నిలిచింది ఈ సినిమా. సినిమా కి ఆడియన్స్ లో సాలిడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయిస్తే సాలిడ్ వ్యూస్ వస్తాయని OTT జైంట్స్ అన్నీ కూడా…

భారీ ఆఫర్స్ ని ఈ సినిమా కి ఇవ్వడం మొదలు పెట్టాయి, అలా అలా రేటు అమాంతం పెరుగుతూ పోయింది కానీ మేకర్స్ ఏమాత్రం తొణకలేదు. తర్వాత రేటు ఇంకా పెరిగితే హీరో ఎంటర్ అయ్యి ససేమీరా నో చెప్పాడు. ఇక లేటెస్ట్ గా సినిమా కి ఇది వరకు రేటు…

50 కోట్ల కన్నా మరో 2-3 కోట్లు అధికంగా ఇవ్వడానికి కూడా అమెజాన్ ప్రైమ్ ముందుకు వచ్చిందట, ఇది మమ్మోత్ రేటు అనే చెప్పాలి. కానీ సినిమా ఔట్ పుట్ అద్బుతంగా వచ్చింది అన్న టాక్ ఉండటం తో థియేటర్స్ లో రిలీజ్ చేస్తే రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉంటుంది అన్న నమ్మకంతో మరోసారి ఆఫర్ కి నో చెప్పి ఇప్పుడు….

సినిమాను జులై లో థియేటర్స్ తెరచినప్పుడు 50% ఆక్యుపెన్సీ తో అయినా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలా అయితే సెకెండ్ వేవ్ తర్వాత ఫస్ట్ మూవీ ఇదే అయ్యే అవకాశం ఉంటుంది, అండ్ లాంగ్ రన్ దక్కే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి ఈ బిగ్గెస్ట్ రిస్క్ సినిమా కి ప్లస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Leave a Comment