న్యూస్ రివ్యూ

ఇదే ఫైనల్….సరిలేరు నీకెవ్వరు ఫైనల్ టాక్ ఇదే!!

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున 1600 కి పైగా థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోల నుండే సినిమా కి టాక్ పాజిటివ్ గా ఉండగా రెగ్యులర్ షోలకు కూడా చాలా సెంటర్స్ లో టాక్ ఇదే విధంగా ఉంది, ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి…

ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఫైనల్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా వారి నుండి వినిపిస్తున్న టాక్ ఎలా ఉందంటే… ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎంటర్ టైన్ మెంట్ సినిమా లో చాలా వరకు మెప్పించిందని చెబుతుండగా…

విజయశాంతి రోల్ మెప్పించిందని, మహేష్ పెర్ఫార్మెన్స్ దుమ్ము లేపాడని అంటున్నారు, మాస్ ఫైట్స్ కొద్దిగా హెవీ అయిన ఫీలింగ్ కలిగినా ఓవరాల్ గా మూవీ మహేష్ ఇది వరకు సినిమాలతో పోల్చితే చాలా బెటర్ గా ఉందని, మళ్ళీ దూకుడు రేంజ్ లో మహేష్ ఆకట్టుకున్నాడని అంటున్నారు.

ఇక కామన్ ఆడియన్స్ కామెడీ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాలేదని అంటున్నారు, ఇక స్టొరీ కూడా రొటీన్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నా ఓవరాల్ గా పైసా వసూల్ మూవీ అని లెంత్ కొంచం తగ్గించి ఉంటె మరింత బాగుండేదని అంటున్నారు. ఓవరాల్ గా వారి నుండి కూడా సినిమా కి ఎబో యావరేజ్ నుండి…

హిట్ కి మధ్యలో టాక్ వినిపిస్తుందని చెప్పొచ్చు. ఫైనల్ గా సినిమా ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ రేంజ్ లో, ఫ్యామిలీ ఆడియన్స్ కి హిట్ రేంజ్ లో, కామన్ ఆడియన్స్ కి ఎబో యావరేజ్ నుండి హిట్ కి మధ్యలో టాక్ వినిపిస్తుంది, సంక్రాంతి అడ్వాంటేజ్ కి ఇది చాలా వరకు సరిపోతుంది అనుకుంటా…ఇక కలెక్షన్స్ పరంగా సినిమా ఎలా దుమ్ము లేపుతుందో చూడాలి.

Leave a Comment