గాసిప్స్ న్యూస్

ఇన్ని కోట్ల రేటు ఆఫర్ వస్తే…సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడేంటి!!

బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు బాగుంటే భారీ ఎత్తున రిలీజ్ ను సొంతం చేసుకుని రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవాల్సిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకో బోతుండగా అలాగే 13 న పే పెర్ వ్యూ పద్దతి లో డిజిటల్ గా కూడా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా సినిమా పే పెర్ వ్యూ పద్దతిలో ఒక్కో టికెట్ 249 రేటు తో రిలీజ్ కాబోతుంది. కానీ సల్మాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రీజన్ ఏంటి అనేది తెలియరాలేదు కానీ ఓవరాల్ గా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కోసం కోట్లకు కోట్ల ఆఫర్స్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.

నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్నీ ప్లస్ లాంటి టాప్ OTT లు ఏకంగా 150 నుండి 200 కోట్ల రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రిలీజ్ హక్కుల కోసం పోటి పడ్డాయి. అమెజాన్ ప్రైమ్ అయితే 220 కోట్ల రేంజ్ రేటు కి కూడా సిద్ధం అయ్యిందని టాక్ చాలా గట్టిగానే వినిపించింది.

ఆ రేంజ్ రేటు అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయితే వచ్చే కలెక్షన్స్ కి సమానం అని చెప్పొచ్చు. అయినా కానీ అంతటి ఆఫర్ కి కూడా నో చెప్పి సినిమాను పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రిలీజ్ అయిన 4 -5 వారాల తర్వాత జీ 5 యాప్ లోనే సినిమా డిజిటల్ రిలీజ్ కూడా…

ఉండబోతుంది….. అంటే అప్పటి వరకు పే పెర్ వ్యూ పద్దతిలో సినిమా ఎంత కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తి కరం అని చెప్పాలి. ట్రేడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా కి పే పెర్ వ్యూ పద్దతిలోనే సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని  దుమ్ము లేపే చాన్స్ ఉందని అంటున్నారు. టాక్ తేడా కొడితే కొంచం ఎఫెక్ట్ ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Leave a Comment