గాసిప్స్ న్యూస్

ఇన్ని ఫైట్ సీన్సా….ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం అయితే!!

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా ఆర్ ఆర్ ఆర్… ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో అజయ్ దేవగన్, ఆలియా భట్ లాంటి భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ ప్రస్తుతానికి కూడా ఎట్టి పరిస్థితులలో అనుకున్న టైం కే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పక్కగా చెబుతున్నారు.

ఇక ఈ సినిమా లో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే కాగా రీసెంట్ గా సినిమాలో ఫైట్ సీన్ గురించిన న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది, ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమాలో ఓవరాల్ గా యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నయట.

ఆల్ మోస్ట్ ఇద్దరు హీరోలకు ఈక్వల్ గా అలాగే కలిసి చేసే సీన్స్ తో కలిపి సినిమాలో 14 యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు ఇప్పుడు… అంటే ప్రతీ 10 నిమిషాలకు ఒక యాక్షన్ సీన్ ఉంటుందని చెప్పొచ్చు, జక్కన్న ఎలివేషన్ ల గురించి అందరికీ తెలిసిందే కాబట్టి ప్రతీ…

10 నిమిషాలకు ఒక హీరో ఎలివేషన్ సీన్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇందులో అజయ్ దేవగన్ కి కూడా ఒక ఫైట్ సీన్ ఉంటుందని అంటున్నారు. ఇద్దరు హీరోలు కూడా ఒక ఫైట్ సీన్ లోనే కలుస్తారని, అప్పటి నుండి రచ్చ మరో విధంగా ఉంటుందని అంటున్నారు. ఆల్ మోస్ట్ ఎన్టీఆర్ మూడేళ్ళుగా ఈ సినిమా కోసం సమయం కేటాయించగా…

రామ్ చరణ్ ఆల్ మోస్ట్ రెండున్నర ఏళ్ల టైం ని ఈ సినిమా కోసం కేటాయించారు. పాన్ ఇండియా లెవల్ లో అత్యంత భారీ ఎత్తున రూపొందుతున్న ఈ సెన్సేషనల్ మూవీ ప్రస్తుత సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఇంకా లాంగ్ గా ఉంటే రిలీజ్ సంక్రాంతి కి చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది త్వరలోనే తెలుస్తుంది.

Leave a Comment