న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇప్పుడు అఫీషియల్….100 కోట్ల భీభత్సం…ఇండియాలో బిగ్గెస్ట్ రికార్డ్!!

డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్స్ రావడం ఆల్ మోస్ట్ ఓకే అనుకున్నట్లే అనుకుని నో చెప్పి థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన డాక్టర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన రిజల్ట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది, సినిమా 24 రోజుల్లో టోటల్ గా 94.95 కోట్ల గ్రాస్ ను అందుకోగా 27 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అఫీషియల్ గా కంప్లీట్ చేసుకుంది.

మేకర్స్ 25 రోజులకే కంప్లీట్ అయ్యింది అంటూ చెప్పినా ట్రేడ్ లెక్కల ప్రకారం 27 వ రోజు కలెక్షన్స్ తో సొంతం చేసుకుంది. తమిళనాడులో 70 కోట్ల గ్రాస్ ను తెలుగు లో 4.22 కోట్ల గ్రాస్ ను కర్ణాటకలో 4.05 కోట్ల గ్రాస్ ను కేరళలో 1.52 కోట్ల గ్రాస్ ను….

రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల గ్రాస్ ను అందుకోగా టోటల్ ఇండియాలో 80.54 కోట్ల గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ మొత్తం మీద అప్ డేట్ అయిన కలెక్షన్స్ 20 కోట్ల దాకా ఉండగా టోటల్ గా సినిమా 100.54 కోట్ల గ్రాస్ ను 54 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుంది. 37 కోట్ల టార్గెట్ కి సినిమా 17 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఇండియాలో సెకెండ్ వేవ్ తర్వాత 100 కోట్ల మార్క్ అందుకున్న ఫస్ట్ మూవీగా రికార్డ్ కొట్టింది ఈ సినిమా.

Leave a Comment