గాసిప్స్ న్యూస్

ఇప్పుడే హిట్ కొట్టాడు…మళ్ళీ ఫ్లాఫ్ డైరెక్టర్ తో సినిమా!!

టాలీవుడ్ లో భారీ స్టార్ కాస్ట్ తో మీడియం టు భారీ బడ్జెట్ మూవీస్ చేసే హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒకరు, 2014 లోనే టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసినా కానీ మొట్ట మొదటి హిట్ ని లాస్ట్ ఇయర్ సొంతం చేసు కున్నాడు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన రాక్షసన్ సినిమా ను తెలుగు లో….

రాక్షసుడు పేరు తో రీమేక్ చేయగా ఫస్ట్ రెస్పాన్స్ అంతంత మాత్రమే వచ్చినా తర్వాత మౌత్ టాక్ ఎఫెక్ట్ తో 50 డేస్ దాకా రన్ ని కొనసాగించి బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బెల్లంకొండ కెరీర్ లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలిచింది ఈ సినిమా.

ఇక కెరీర్ లో ఫస్ట్ హిట్ కొట్టిన జోష్ లో రెట్టించిన జోరు తో భారీ సినిమాలు తీస్తాడు అనుకుంటే అందరికీ షాక్ ఇస్తూ రాక్షసుడు కన్నా ముందే మొదలు పెట్టిన అల్లుడు అదుర్స్ కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కగా ఆ సినిమా లాక్ డౌన్ వలన ఆగిపోగా…

తర్వాత అయినా సాలిడ్ మూవీ ప్లాన్ చేస్తాడు అనుకుంటే రీసెంట్ టైం లో స్వామిరారా తప్పితే మరే సినిమా కూడా ఆశించిన రేంజ్ లో విజయాన్ని అందుకొని డైరెక్టర్ సుధీర్ వర్మ తో ఓ డిఫెరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట బెల్లంకొండ. కంటెంట్ పరంగా ఆకట్టుకోకున్నా కానీ… టేకింగ్ పరంగా మాత్రం సుధీర్ వర్మ సినిమా లకు వంక పెట్టలేం.

అయినా కానీ ఇప్పుడే హిట్ కొట్టి జోరు అందుకున్న టైం లో మంచి హిట్ డైరెక్టర్ తో సినిమా చేసి కెరీర్ ని మరింత బిల్డ్ చేసుకోవాల్సిన టైం లో బెల్లంకొండ రిస్కీ మూవీ చేస్తున్నాడు అని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు, ఏమో రిస్కీ మూవీ తోనే మళ్ళీ రాక్షసుడు లాగా మంచి హిట్ కొట్టొచ్చు గా అన్న టాక్ కూడా ఉందని చెప్పాలి..

Leave a Comment