న్యూస్

ఇవాల్టి నుండి నాన్ స్టాప్…..కాచుకోండి ఇక!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషన్ 151 వ సినిమా సైరా నర సింహా రెడ్డి కోసం అందరు ఎంత ఆశ గా ఎదురు చూస్తున్నారో తెలిసిందే, 10 ఏళ్ళకి ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ మళ్ళీ రెండున్నర ఏళ్ళు టైం తీసు కుని చేసిన సినిమా ఇది, దాంతో అభిమానుల తో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమా పై ఆసక్తి ఓ రేంజ్ లో ఉందని చెప్పొచ్చు.

కానీ సినిమా రిలీజ్ పట్టుమని 10 రోజులు కూడా లేవు ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ పనులు మొదలు కాలేదు, తెలుగు వరకు పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేదు, ఎందుకంటే మెగాస్టార్ మూవీ కాబట్టి ఎలాగు ఆడియన్స్ థియేటర్స్ కి ఎగబడి వెళతారు కానీ… ఇతర భాషల్లో సినిమా ను భారీ గా రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నప్పుడు…

అదే రేంజ్ లో పబ్లిసిటీ కూడా చేయాల్సి ఉంటుంది, లేటెస్ట్ బిగ్ మూవీ సాహో నే తీసుకున్నా ప్రభాస్ అన్ని చోట్లకు వెళ్లి రిలీజ్ కి 20 రోజుల ముందు నుండే తెగ ప్రమోట్ చేశాడు. కానీ సైరా టీం ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్ పనులను మొదలు పెట్టలేదు..

ఇలా చేయడానికి ఒక రీజన్ ఉందని కూడా చెబుతున్నారు, ప్రమోషన్ ఎక్కువ చేసి అంచనాలను పెంచి తర్వాత అందుకోక పొతే కష్టం అని సైలెంట్ గా ఉన్నారని టాక్. కానీ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత నాన్ స్టాప్ గా సినిమా ప్రమోషన్స్ జరుగుతాయని, టాలీవుడ్ వరకు…పెద్దగా ప్రమోషన్స్ ఉండవు కానీ..

ఇతర ఇండస్ట్రీ లలో విస్తృతంగా సినిమా ప్రమోషన్ పనులను చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారట. ఇక సాంగ్స్, ప్రోమో లు కొత్త పోస్టర్లు, ఇంటర్వ్యూలు ఇలా ఈ 10 రోజులు నాన్ స్టాప్ గా సినిమా ప్రమోషన్స్ జరుగుతాయని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

Leave a Comment