టోటల్ కలెక్షన్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఇవే ఇప్పుడు టాప్ 10…తెలుగు వర్షన్ బిగ్గెస్ట్ షేర్ మూవీస్!!

బాహుబలి కి ముందు కూడా టాలీవుడ్ లో సాలిడ్ హిట్స్ ఉన్నాయి కానీ…. టాలీవుడ్ మార్కెట్ ఎక్స్ పాన్షన్ బాహుబలి రాకతో ఓ రేంజ్ లో పెరిగిన విషయం తెలిసిందే, ఇక రీసెంట్ గా బిగ్ హీరోస్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన ఊచకోత అయితే మరో లెవల్ లో ఉందనే చెప్పాలి. దాంతో టాలీవుడ్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 100 కోట్లకు పైగా షేర్ ను అవలీలగా రాబట్టే సత్తా ఉన్న ఇండస్ట్రీ గా సంచలన రికార్డ్ ను నమోదు చేసి దుమ్ము లేపింది.

ఇక ఇది వరకు 100 కోట్లు అనేది కలే అనుకున్న వాళ్ళకి షాక్ ఇస్తూ మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసిన బాహుబలి సిరిస్ రెండు పార్టుల తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే… మొదటి పార్ట్ వరల్డ్ వైడ్ గా 194 కోట్ల షేర్ ని వసూల్ చేస్తే.. రెండో పార్ట్ 360 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక నాన్ బాహుబలి మూవీస్ లో టాప్ 10 షేర్ ని అందుకున్న తెలుగు సినిమలాను గమనిస్తే
1. AlaVaikunthapurramuloo: 159.2Cr
2. SarileruNeekevvaru: 138.78Cr
3. SyeRaa: 128Cr~
4. Rangasthalam(2018)——127.5 Cr
5. Saaho: 112.73Cr
6. Khaidi No 150(2017)—-104.61 Cr
7. Maharshi: 104.58Cr
8. Bharat Ane Nenu(2018)—–101 Cr
9. Aravindha Sametha(2018)—- 98.9 Cr
10. VakeelSaab(2021) — 86.36Cr
11. Srimanthudu(2015)———–85 Cr

ఇవీ మొత్తం మీద ప్రస్తుతం నాన్ బాహుబలి మూవీస్ లో హైయెస్ట్ షేర్ ని అందుకున్న టాప్ 10 మూవీస్… లాస్ట్ ఇయర్ సంక్రాంతి కి రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో ఊచకోత కోయగా పోటి లో కూడా ఈ రెండు సినిమాలు సాధించిన రికార్డులు అమోఘం అనే చెప్పాలి.

ఇక అల వైకుంఠ పురం లో సృష్టించిన రికార్డులు అయితే మరో లెవల్ అనే చెప్పాలి. ఇక 2021 లో ఇప్పటి వరకు ఒక్క పెద్ద హీరో సినిమానే వచ్చింది.. సెకెండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమాల జాతర రాబోతుంది. అప్పుడు కలెక్షన్స్ రికార్డుల పరంగా కొత్త సంచలనాలు నమోదు అవ్వడం ఖాయమని చెప్పొచ్చు…

Leave a Comment