న్యూస్

ఇష్క్ ట్రైలర్ రివ్యూ…..బాగుంది ట్రైలర్!

సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమాల్లో తిమ్మరుసు తర్వాత రిలీజ్ ను అనౌన్స్ చేసిన సినిమా ఇష్క్… తేజ సజ్జ హీరోగా ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా రూపొందుతున్న ఈ సినిమా మలయాళ ఇష్క్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమా. ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ ఉండగా….

డైరెక్ట్ రిలీజ్ కోసం అవకాశాలు ఆఫర్స్ ఓ రేంజ్ లో వచ్చినప్పటికీ కూడా, అన్నింటికీ నో చెప్పిన టీం ఈ నెల 30 న సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇక రీసెంట్ గా సినిమా రిలీజ్ ట్రైలర్ ను ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా…..

ట్రైలర్ చిన్నదే అయినా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేలా మెప్పించింది అని చెప్పాలి. ఒక ఇంట్లో కి హీరో వెళ్ళగా అక్కడ నుండి ఎదో తీసుకు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. మరి అది చేసాడా లేదా అనేది సినిమాలో చూడాలి అన్నట్లు ట్రైలర్ లో చూపెట్టగా హీరోయిన్ తో లవ్ సీన్స్ ను కూడా…

కొన్ని చూపెట్టారు… ట్రైలర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా మెప్పించడం విశేషం. ఓవరాల్ గా చిన్న ట్రైలర్ అయినా సినిమా మీద ఇంట్రెస్ట్ ఇంకా పెరిగేలా చేసిందని అని చెప్పాలి. ఇక ట్రైలర్ ఆడియన్స్ ను మెప్పిస్తూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను కూడా కంప్లీట్ చేసుకుంది. U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా….

ఓవరాల్ గా 2 గంటల 2 నిమిషాల లెంత్ రన్ టైం తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఒరిజినల్ మలయాళ వర్షన్ మంచి సక్సెస్ గా నిలిచింది. ఇప్పుడు రీమేక్ అయినా తెలుగు ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించాల్సిన అవసరం తో బరిలోకి దిగుతున్న ఇష్క్ మూవీ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పించగలుగుతుందో చూడాలి ఇక.

Leave a Comment