గాసిప్స్ న్యూస్

ఈ ఆఫర్ నిజం అయితే…ఆల్ ఇండియా లెవల్ లో ప్రభాస్ రచ్చ ఖాయం!!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ముందు వరకు లోకల్ స్టార్ అయినా కానీ బాహుబలి రాకతో తర్వాత ఏకంగా నేషనల్ స్టర్ అయ్యాడు. బాహుబలి విజయంలో జక్కన్న కి ఎంత పేరు వచ్చిందో ప్రభాస్ బాహుబలి పాత్రకి కూడా అంతే పేరు దక్కింది. కానీ అందరి లోను ఎదో మదన… బాహుబలి తో వచ్చిన క్రేజ్ ప్రభాస్ కి ఎంతవరకు హిందీ హెల్ప్ అవుతుందో లేదో అని… ఇలాంటి టైం లోనే…

వచ్చిన సాహో సినిమా ఫ్లాఫ్ టాక్ తోనే హిందీ లో ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుని అక్కడ ప్రభాస్ కి అద్బుతమైన క్రేజ్ ఉందని నిరూపించింది. సౌత్ లో తెలుగు లో మంచి వసూళ్ళనే సాధించిన ఈ సినిమా తమిళ్ మలయాళంలో…

ఓపెనింగ్స్ వచ్చినా టాక్ కారణంగా కలెక్షన్స్ తర్వాత పెద్దగా సాధించలేదు. ఇక సాహో తర్వాత ప్రభాస్ ఇప్పుడు జాన్ సినిమా తో బిజీ గా ఉండగా క్రమం తప్పకుండా బాలీవుడ్ నుండి ప్రభాస్ కి క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయట. అందులో ఇప్పుడు ఓ రెండు ఆఫర్స్ మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. ఆ 2 సినిమాలే ఒకటి ధూమ్ సిరీస్ మరోటి వార్ సీక్వెల్.

ధూమ్ 3 తర్వాత 4 వ సినిమా కోసం అందరు ఆశగా ఎదురు చూస్తుండగా ఈ సారి ధూమ్ లో ప్రభాస్ నటించేలా చేయాలనీ భావిస్తున్నారు. ప్రభాస్ తో పాటు తిరిగి హృతిక్ ని కానీ లేదా సల్మాన్ ని కానీ తీసుకోవాలేనే ఆలోచనలో ఉండగా ఈ సినిమా కి మరింత టైం పట్టే చాన్స్ ఉందని సమాచారం.

ఇక ఇది కాకుండా రీసెంట్ గా యావరేజ్ రివ్యూ లతో కూడా 300 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్న వార్ సినిమా సీక్వెల్ లో హృతిక్ తో కలిసి ప్రభాస్ ని నటింపజేయాలని భారీ ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఏది కన్ఫాం అయినా ప్రభాస్ క్రేజ్ ఆల్ ఇండియా లెవల్ లో మరింత రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment