గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఈ క్లాష్ ఏంటి సామి…ఆ సినిమా కి పండగే ఇక!!

సంక్రాంతి సీజన్… టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీ సీజన్ సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి పోటి లో మూడు నాలుగు సినిమాలు ఉన్నా కానీ అన్ని సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ని సాధించే అల్టిమేట్ స్కోప్ ఉన్న సీజన్ గా చెప్పుకోవచ్చు. అందుకే ఆ సీజన్ లో ఒకటి రెండు పెద్ద సినిమాలు ఒకటి రెండు చిన్న సినిమాలు ప్రతీ ఇయర్ తమ లక్ ని పరీక్షించు కుంటూ ఉంటాయి.  ఇక 2020 సంక్రాంతి సీజన్ మరింత రసవత్తరంగా సాగనుంది, డానికి కారణం

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో, కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమాలు కన్ఫాం అవ్వగా ఇప్పుడు షాకింగ్ గా వెంకీ మామ కూడా కన్ఫాం అయినట్లే అంటున్నారు. దాంతో రిలీజ్ డేట్ ల విషయం లో క్లాష్ తప్పదు అనుకుంటే మహేష్ మరియు అల్లు అర్జున్ ల సినిమాలు రెండు ఒకే రోజు రాబోతున్నాయి.

జనవరి 12 న ఈ ఇద్దరు హీరోల సినిమాలు క్లాష్ కాబోతున్నాయి. రీసెంట్ టైం లో ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయింది లేదు.  కానీ ఇప్పుడు ఎందుకనో ఒకరి మీద ఒకరు సై అంటే సై అని రిలీజ్ డేట్ లు ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియా లో అనౌన్స్ చేసి ఓపెన్ వార్ డిక్లేర్ చేసినట్లు చేశారు.

కానీ జనవరి 12 కన్నా జనవరి 10 మంచి డేట్ అని చెప్పొచ్చు. వీకెండ్ మొదలు అయ్యే ఆ డేట్ ని తమిళ్ డబ్ మూవీ దర్బార్ కి ఫ్రీ గా వదిలేశారు. సూపర్ స్టార్ రజినీ మురగదాస్ ల కాంబో లో వస్తున్న ఆ సినిమా జనవరి 10 న రిలీజ్ అని ముందే కన్ఫాం చేయగా 11 న మన సినిమాల్లో ఎదో ఒకటి వస్తుంది అనుకున్న రెండు రోజులు దర్బార్ కి టైం ఇచ్చి 12 న క్లాష్ కి తేర తీశారు మన హీరోలు.

13 న గ్యాప్ ఇవ్వగా 14 న వెంకీ మామ దిగే అవకాశం ఉంది. ఇక 15 న కళ్యాణ్ రామ్ సినిమా రిలీజ్ కానుంది. దాంతో రజినీ సినిమాకి 2 రోజుల ఓపెన్ గ్రౌండ్ లభించనుంది… సంక్రాంతి టైం లో 2 రోజుల ఓపెన్ గ్రౌండ్ అంటే ఆల్ మోస్ట్ తెలుగు బిజినెస్ మొత్తం వెనక్కి తెచ్చుకోవచ్చు. డబ్బింగ్ సినిమా కి ఫేవర్ చేస్తూ మన డైరెక్ట్ సినిమాలు క్లాష్ లో రావడం ఎంతవరకు సమంజసమో వాళ్ళకే తెలియాలి.

Leave a Comment