గాసిప్స్ న్యూస్ బాక్స్ ఆఫీస్

ఈ రేంజ్ బిజినెస్ ఏంటి సామి…మెంటల్ మాస్ ఇది!!

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి సమ్మర్ కానుకగా ఏప్రిల్ 16 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. మజిలీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాగ చైతన్య చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు సాలిడ్ గా ఉండగా సినిమా సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం తో…

అంచనాలు మరింతగా పెరిగి పోయాయి అని చెప్పాలి. లేటెస్ట్ సాంగ్ సారంగధరియా అయితే సంచలన వ్యూస్ రికార్డులతో దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా కి ఇప్పుడు బిజినెస్ సాలిడ్ గా జరుగుతుంది అని సమాచారం… సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తుంది.

నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే 20 కోట్లకు పైగా సొంతం చేసుకుని దుమ్ము లేపిన ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ కూడా నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ అనిపించే రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంటుందట. సినిమా నైజాం మరియు వైజాగ్ ఏరియాల లోనే…

15 కోట్ల రేంజ్ ఆఫర్స్ వస్తూ ఉండగా ఎంటైర్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ బిజినెస్ లెక్క 30 కోట్ల రేంజ్ లో ఉందని ట్రేడ్ లో సమాచారం… ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్క 35 కోట్ల లోపు ఉంటుందని అంటున్నారు, ఇది నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ లెక్క అని చెప్పాలి, కానీ సినిమా క్రేజ్ ను బట్టి కొన్ని ఏరియాల్లో నిర్మాతలు ఓన్ గా సినిమాను రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు.

దాంతో ఓవరాల్ బిజినెస్ లెక్క కొంచం అటూ ఇటూ గా ఉండే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద బిజినెస్ నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బిజినెస్ ను కన్ఫాం చేసుకుంటుందా లేదా అన్నది అతి త్వరలోనే అఫీషియల్ కన్ఫామేషన్ వస్తుందని చెప్పొచ్చు.

Leave a Comment