న్యూస్ బాక్స్ ఆఫీస్

ఈ సినిమా ఊపు ఆగడం లేదు…4437 కోట్ల ఊచకోత ఇది!

ఇండియన్ బాక్స్ ఆఫీస్ మరికొన్ని వారాల తర్వాత తేరుకునే అవకాశం ఉండగా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మాత్రం ఒక్క సినిమా తో బాగానే తేరుకున్నట్లు అనిపిస్తుంది. ఈ ఇయర్ సెకెండ్ వేవ్ కన్నా ముందు గాడ్జిల్లా V కాంగ్ సినిమా తో అద్బుతమైన కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా సెకెండ్ వేవ్ వలన మళ్ళీ థియేటర్స్ అన్నీ కూడా మూత పడగా తర్వాత పరిస్థితులు నార్మల్ అవుతున్న టైం లో రిలీజ్ అయిన…

బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచేజ్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో భాగంగా వచ్చిన 9 వ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9 బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు చైనాలో రిలీజ్ అయ్యి అక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి జోరు చూపుతుంది.

సినిమా చైనా లో 200 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్ళని సొంతం చేసుకోగా తర్వాత మిగిలిన దేశాల్లో రిలీజ్ అయిన తర్వాత కూడా రన్ ఏమాత్రం ఎండ్ అవ్వడం లేదు. రీసెంట్ గా సినిమా హాల్ఫ్ బిలియన్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం చేయగా తర్వాత కూడా…

పరుగు ఏమాత్రం ఆపకుండా సినిమా ఇప్పుడు 600 మిలియన్స్ వైపు అడుగులు వేస్తూ దూసుకుపోతుంది. సినిమా రీసెంట్ గా సాధించిన కలెక్షన్స్ తో 592 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని అల్టిమేట్ లెవల్ లో లాంగ్ రన్ ని కొనసాగిస్తూ వెళుతుండటం విశేషం అని చెప్పాలి. ఇండియన్ కరెన్సీ లో ఆల్ మోస్ట్ 4437 వేల కోట్ల కలెక్షన్స్ ని సినిమా ఇప్పటి వరకు సాధించగా…

పరుగు ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో కొనసాగిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇక ఇండియా లో ఈ సినిమా వచ్చే నెలలో ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇండియన్ కలెక్షన్స్ కూడా అనుకున్న రేంజ్ లో ఉంటే సినిమా ఓవరాల్ లెక్క మరో రేంజ్ లో ఉండే అవకాశం ఉంది…

Leave a Comment