గాసిప్స్ న్యూస్

ఈ సినిమా కనుక ఓకే అయితే…రామ్ రేంజ్ ఓ లెవల్ లో పెరుగుతుంది!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ జోష్ లో ఉన్నాడని చెప్పాలి. కెరీర్ లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న మాస్ ఇమేజ్ ను రెండేళ్ళ క్రితం ఇస్మార్ట్ శంకర్ తో సొంతం చేసుకుని కెరీర్ లో ఫస్ట్ 40 కోట్ల షేర్ మార్క్ మూవీ ని సొంతం చేసుకున్న రామ్ తర్వాత చేసిన రెడ్ మూవీ యావరేజ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ ఇప్పుడు కోలివుడ్ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లో తమిళ్ తెలుగు బైలింగువల్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కుతుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమాను అఫీషియల్ గా ఇంకా…

కన్ఫాం చేయని రామ్ కథలను మాత్రం వింటున్నాడని తెలుస్తుండగా తన అప్ కమింగ్ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఉండే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు, రామ్ కి ఆల్ రెడీ ఒక కథ లైన్ ని చెప్పిన బోయపాటి ఆల్ మోస్ట్ రామ్ ని…

కన్విన్స్ చేసినట్లే అని అంటున్నారు కానీ ముందుగా అఖండతో బోయపాటి మాస్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉందని, తర్వాత రామ్ తో సినిమా కన్ఫాం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, బోయపాటి రామ్ తో పాటే అల్లు అర్జున్ కి కూడా ఓ కథని వినిపించగా తన అప్ కమింగ్ మూవీస్ ఈ ఇద్దరితో ఉండే అవకాశం ఉందని అంటున్నారు…

కెరీర్ లో ఆల్ రెడీ మాస్ ఇమేజ్ ను ఇప్పుడు సొంతం చేసుకున్న రామ్ బోయపాటి తో చేసే మాస్ మూవీని ఓకే చేస్తే కెరీర్ లో మాస్ ఇమేజ్ మరో లెవల్ కి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. బోయపాటి ఒక్క వినయ విదేయ రామ విషయంలో తప్ప కెరీర్ లో ఇతర సినిమాలు అన్నింటితో ఆడియన్స్ లో తనదైన ముద్ర వేశాడు. వినయ విదేయ రామ టెలివిజన్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. మరి రామ్ ఫైనల్ నిర్ణయం ఏమవుతుందో చూడాలి.

Leave a Comment