న్యూస్

ఈ సినిమా కనుక థియేటర్స్ లో వచ్చి ఉంటేనా!!

టాలీవుడ్ లో ఈ ఇయర్ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేసి ఆడియన్స్ ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో రూపొందిన సెన్సేషనల్ మూవీ నారప్ప కూడా ఒకటి. అవడానికి రీమేక్ సినిమానే అయినా కానీ వెంకటేష్ నారప్ప రోల్ లో ఎలా నటిస్తారో అన్న ఆసక్తి సినిమా పై సాలిడ్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ అయ్యేలా చేసిందని చెప్పాలి.

కానీ సెకెండ్ వేవ్ వలన నిర్మాతల్లో ఒకరికి ఇతర సినిమా ద్వారా నష్టం వచ్చింది అని చెప్పడం తో ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేశారు. అయినా కానీ ఆడియన్స్ నుండి అద్బుతమైన టాక్ ను సొంతం చేసుకుని దూసుకు పోతున్న నారప్ప సినిమా ఒకవేళ…

థియేటర్స్ లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ ఓ రేంజ్ లో షేక్ అయ్యి ఉండేది అని చెప్పొచ్చు. ఆల్ రెడీ సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అంటూ చాలా మంది డిజిటల్ రిలీజ్ కన్ఫాం అయినప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ కూడా చేశారు కానీ ఫలితం రాలేదు.

కానీ ఒకవేళ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటే ఫ్లాష్ బ్యాక్ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించేదేమో కానీ అది కాకుండా సినిమాలో వెంకీ సెంటిమెంట్ సీన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టేవాళ్ళు. ఇక సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ కి బి సి సెంటర్స్ లో మాస్ జనాలు ఓ రేంజ్ లో థియేటర్స్ లో రిపీట్ వేసేవాళ్ళు అని చెప్పొచ్చు.

అదే టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితులు ఏమాత్రం బాగున్నా మినిమం లో మినిమం 80 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు డిజిటల్ లో కూడా అద్బుతమైన వ్యూస్ తో దూసుకు పోతున్న నారప్ప ఒరిజినల్ ను మరిపిస్తూ దూసుకు పోతుండటం విశేషం.

Leave a Comment