న్యూస్ బాక్స్ ఆఫీస్

ఈ సినిమా కుమ్ముతుంది….50% లో ఈ రేంజ్ కలెక్షన్స్ ఏంటి సామి!!

థియేటర్స్ లో 100% ఆక్యుపెన్సీ నుండి రీసెంట్ గా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన ఆక్యుపెన్సీ ని కొన్ని చోట్ల పూర్తిగా తగ్గించి థియేటర్స్ ని మూసేయగా కొన్ని చోట్ల 50% కి తగ్గించారు. మన దగ్గర కూడా త్వరలో ఇదే రూల్ వస్తుంది అంటున్నారు. ఇక రీసెంట్ గా తెలుగు లో వకీల్ సాబ్ రిలీజ్ టైం లోనే తమిళ్ లో రిలీజ్ అయిన మూవీ కర్ణన్ కూడా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది.

ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా కి అక్కడ యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. సినిమా అద్బుతంగా ఉందని, ధనుష్ నటించిన ఇది వరకు బెస్ట్ మూవీస్ అసురన్, వడా చెన్నై లాంటి మూవీస్ కన్నా కూడా చాలా బాగుంది అంటూ…

సినిమా ని చూసిన వాళ్ళు అందరూ మెచ్చు కుంటూ ఉండగా సినిమా మొదటి రోజు అక్కడ 10.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా, 2 వ రోజు 6.45 కోట్ల కలెక్షన్స్ ని సాధించింది, ఇక్కడ విశేషం ఏంటంటే… ఫస్ట్ డే 100% ఆక్యుపెన్సీ ఇవ్వగా రెండో రోజు నుండి మాత్రం…. 50% ఆక్యుపెన్సీ తోనే సినిమా…

అక్కడ రన్ అవుతుంది. అయినా కానీ రెండో రోజు 6.45 కోట్ల గ్రాస్ ను, మూడో రోజు 8.6 కోట్ల గ్రాస్ ను, 4 వ రోజు 3.10 కోట్ల గ్రాస్ ను 5 వ రోజు 3.6 కోట్ల గ్రాస్ ను 6 వ రోజు మళ్ళీ 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తమిళ్ లో సొంతం చేసుకుంది. మొత్తం మీద 6 రోజుల్లో సినిమా అక్కడ… 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగా…

రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి సినిమా 42-44 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి ఉంటుందని అంటున్నారు. అన్ని చోట్లా 50% ఆక్యుపెన్సీ తో ఇలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. ఇలానే లాంగ్ రన్ సినిమా కి ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Comment