గాసిప్స్ న్యూస్

ఈ సినిమా టికెట్ కొంటే ఏడాది మొత్తం ఫ్రీ….ఇదేం పబ్లిసిటీ బాబు!

సినిమాల రిలీజ్ టైం లో బాలీవుడ్ వాళ్ళు మన వాళ్ళ కంటే కూడా ఎక్కువగా సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు, అన్ని రాష్ట్రాలలో తిరిగి సినిమాలను ప్రమోట్ చేసుకుంటారు, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు, దాంతో తమకి తోచిన రీతిలో సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే డైరెక్ట్ గా డిజిటల్ లో అలాగే కొన్ని ఏరియాల్లో థియేటర్స్ లో…

మే 13 న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా సినిమా ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ట్రైలర్ కి గాని సాంగ్స్ కి కానీ రెస్పాన్స్ మిక్సుడ్ గానే వచ్చింది, ఇక సినిమా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ముందు ఒక్క టికెట్ రేటుని…

ఏకంగా 299 గా పెట్టడం తో ఎవరు చూస్తారు ఈ రేటు తో అంటూ ట్రోల్ చేస్తే ఆ రేటు ని 249 కి తగ్గించారు. ఆ రేటు తో కూడా చూడటం కష్టమే అంటూ మళ్ళీ ట్రోల్ చేయడం తో ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ను తీసుకువచ్చారు. ఈ సినిమా రేటు 249 కి మరో…

250 రేటు యాడ్ చేసి 499 తో సినిమాను చూస్తె జీ 5 యాప్ లో 1 ఏడాది సబ్ స్క్రిప్షన్ ను ఫ్రీ గా ఇస్తామని తెగ పోస్టర్ లలో ప్రమోట్ చేస్తున్నారు, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ లాంటి OTT యాప్స్ తో పోల్చితే జీ 5 వాడే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ… అందులో కంటెంట్ కూడా తక్కువే అని చెప్పాలి… అలాంటిది ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగ…

మొత్తం మీద 499 పెట్టి సినిమా చూస్తె ఏడాది జీ 5 సబ్ స్క్రిప్షన్ ఫ్రీ అంటూ పోస్టర్ ప్రచారం చేస్తుంటే చాలా మంది పట్టించుకోవడం లేదు… మరి రిలీజ్ టైం కి పరిస్థితులు మారి సినిమా కి భారీ వ్యూవర్ షిప్ వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారగా ఈ ప్రమోషన్ లు చూసి ఎదో ఒక రేటు కి అమ్మేసి డైరెక్ట్ రిలీజ్ చేయకుండా ఇలాంటి ప్రమోషన్ లు అవసరమా అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Leave a Comment