న్యూస్

ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటేనా….అద్బుతమైన ఛాన్స్ మిస్!!

కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరోల్లో సూర్య కూడా ఒకరు, కెరీర్ లో హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ కామన్ కానీ తనకున్న క్రేజ్ ని వరుస ఫ్లాఫ్స్ వలన రెండు చోట్లా కోల్పోతూ వచ్చాడు సూర్య, ముఖ్యంగా తెలుగు లో స్టార్ హీరోల లెవల్ లో క్రేజ్ ని సొంతం చేసుకున్న సూర్య ఈ మధ్య వరుస ఫ్లాఫ్స్ తో మినిమమ్ ఓపెనింగ్స్ ని…

కూడా సొంతం చేసుకోలేక పోయాడు, ఇక తెలుగు లో సూర్య కి హిట్ దక్కి చాలా కాలమే అవుతుంది, అప్పుడెప్పుడో 24 సినిమాతో మెప్పించిన సూర్య తెలుగు తమిళ్ లో లాస్ట్ బిగ్ హిట్ ఆ సినిమా తోనే సొంతం చేసుకున్నాడు. ఇలాంటి టైం లో ఎన్నో ఆశలను పెట్టుకున్న…

సూర్య లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు తెలుగు లో ఆకాశం నీ హద్దు రా పేరుతో సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ కరోనా వలన అలాగే సూర్య నిర్మాణంలో 10 సినిమాలు ఉన్న కారణంగా తనని నమ్ముకున్న వాళ్ళని ఆదుకోవాలని ఈ సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకున్నాడు.

దాంతో అందరి కష్టాలు తీరగా సినిమాకి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో ఇప్పుడు అందరూ కూడా ఈ సినిమా కనుక థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె సూర్య పెర్ఫార్మెన్స్ కి మరింత ఎక్కువ అప్లాజ్ రావడమే కాకుండా థియేటర్స్ లో సూర్య కి తిరుగులేని కంబ్యాక్ మూవీ గా…

ఈ సినిమా నిలిచేదని ముఖ్యంగా తెలుగు లో సూర్య కి తిరుగులేని బూస్టప్ ఇచ్చి ఉండేదని భావిస్తున్నారు. OTT లో రిలీజ్ వల్ల కంప్లీట్ గా అందరికీ సినిమా రీచ్ అవ్వకపోవచ్చు అంటున్నారు. కానీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఉంటె పల్లెటూరి నుండి మాస్ జనాల దాకా అందరికీ సినిమా రీచ్ అయ్యి ఉండేది అంటున్నారు. కానీ పరిస్థితుల వలన ఇలాంటి నిర్ణయం తీసుకున్నా ఇది సూర్య నెక్స్ట్ మూవీస్ కి కచ్చితంగా హెల్ప్ అవ్వడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

Leave a Comment