గాసిప్స్ న్యూస్

ఈ 2 డేట్స్…ఫ్యాన్స్ కి పూనకాలు ఖాయం!!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ మల్టీ స్టారర్ ఆర్.ఆర్.ఆర్ కోసం ఆడియన్స్ ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే, ఇద్దరు స్టార్ హీరోల కలయికలో టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మమ్మోత్ మూవీ అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇయర్ జులై లో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ కొన్ని కారణాల వలన సినిమా రిలీజ్ ను వచ్చే సంక్రాంతి కి పోస్ట్ పోన్ చేశారు.

దాంతో అభిమానులు సినిమా కి సంభందించిన అప్ డేట్స్ లేక పోస్ట్ పోన్ విషయం తెలిసి మరింత నిరుత్సాహ పడ్డారు కానీ సంక్రాంతి బరిలో సినిమా సాధించే రికార్డుల కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు. ఇక సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ కానీ హీరోల లుక్స్ కానీ…

ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇండస్ట్రీ లో గట్టిగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ మార్చ్ నెల ఎండ్ లో మే నెలలో 2 మేజర్ అప్ డేట్స్ రావడం పక్కా అని అంటున్నారు. ముందుగా రామ్ చరణ్ ప్తుట్టిన రోజు మార్చ్ 27 ఉండటంతో…

ఆ రోజు సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం, తర్వాత ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20 న ఉండటం తో ఆ రోజు ఎన్టీఆర్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసే ఆలోచనలో టీం ఉందని ఇండస్ట్రీ లో టాక్ ఈ సారి గట్టిగానే వినిపిస్తుంది. ఎలాగూ రాజమౌళి సినిమా మొదలు పెట్టె సమయం లో…

హీరోల పుట్టిన రోజుల్లో సినిమా లుక్స్ రిలీజ్ చేస్తానని చెప్పాడు, ఇప్పుడు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం తో వెనుకంజ వేసే అవకాశం ఉన్నా ఫ్యాన్స్ కోసం లుక్స్ ని రిలీజ్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో మార్చ్ ఎండ్ వరకు తేలనుంది.

Leave a Comment